నిజంగా శరీరానికి ఆహారం ఎంత అవసరమో అవుతుందో.. నీరు, నిద్ర కూడా అంతే అవసరం అవుతుంది. ఒక రోజు సరిగ్గా నిద్రపోక పోయినా సరే నీరసం ఆవహించి, మరుసటిరోజు కోపం , చికాకు గజిబిజి గా అనిపిస్తుంది. మనం గడుపుతున్న గజి బిజీ బిజీ లైఫ్ స్టైల్లో కంప్యూటర్ కి , ఫోన్ లకి బాగా ప్రభావితం అవుతున్నారు. ఇక యుక్తవయసులో ఉన్నవారు కూడా ఈ మధ్య నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అంతేకాదు పగలంతా కష్టపడి రాత్రి సరిగా నిద్ర పట్టక పోతే ఆ సమస్యలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి అనుభవమే అయి ఉంటుంది. ఇకపోతే రాత్రి నిద్ర సరిగా పట్టకపోతే.. ఎలాంటి వారు బెడ్ రూమ్ లో వీటిని పెట్టుకుంటే నిద్ర హాయిగా రావడమే కాదు మనసుకు ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది.

అలాంటి వాటిలో ఇండోర్ ప్లాంట్స్ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇవి మనల్ని నిద్రపుచ్చడమే కాదు.. మన ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఇండోర్ ప్లాంట్స్ వల్ల మన మనసు చాలా తేలిక పడుతుందట..  ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ మనకి రూమ్ మేట్స్ లాంటివని.. మన సమస్యలను వాటితో చెప్పుకోవడం లేదా కబుర్లు,  సీక్రెట్స్ వంటివి వాటితో చెప్పుకుంటే అవి వింటూనే ఉంటాయని శాస్త్రవేత్తలు కూడా తెలియజేశారు. నిజంగా మొక్కలు మనల్ని నిద్రపుచ్చుతాయా అంటే. అవును.. నిజమే హాయిగా నిద్ర పుచ్చుతాయి అని చెప్పవచ్చు. ఇక అలాంటి మొక్కలు ఏమిటంటే కలబంద, అరేకా పామ్, బాంబూ పామ్, లావెండర్, లెమన్ బామ్, గోల్డెన్ ఫొతోస్, మల్లి, ఆర్కిడ్, పీస్ లిల్లీ, స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్ మొక్కలు మనకి మంచి నిద్రను కలిగిస్తాయి.

కలుషితమైన గాలి వల్ల జలుబు , రకరకాల అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.  కాబట్టి ఈ మొక్కలు గాలిని శుభ్రపరిచి జబ్బులకు దూరంగా ఉంచుతాయి. ముఖ్యంగా ఇలాంటి మొక్కలు మీ గదిలో పెట్టుకోవడం వల్ల స్వచ్ఛమైన  గాలిని పీలుస్తూ సుఖంగా హాయిగా నిద్ర పోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: