వేసవికాలం మొదలైనప్పటి నుంచి ఎండలు ఎక్కువగా మొదలవుతూ ఉన్నాయి. ఇప్పటివరకు ఎండలు భారీగా పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలా వేడికి తట్టుకోలేక కొంతమంది 24 గంటలు ఫ్యాన్ కిందే ఉంటున్నారు. ఎందుకంటే ఫ్యాన్ ఉంటేనే గదిలో ఉండగలమనే విధంగా మారిపోయారు .గదిలో తిరుగుతున్న ఫ్యాన్ ఒకసారి గమనించినట్లయితే దాన్ని బ్లేడు మీద దుమ్ము కనిపిస్తూ ఉంటే.. ఫ్యాన్ ఆన్ చేసిన ప్రతిసారి కూడా గాలిలో ఉండే కణాలు ఎగురుతూ ఉంటాయి. ఫ్యాన్స్ స్పీడ్ పెంచుకొని ఫ్యాన్ కింద ఉండడం వల్ల చర్మం కూడా పొడిబారుతుందట.


అంతేకాకుండా  ఫ్యాన్ గాలి వలన ముక్కు రంధ్రాలు కూడా పొడిబారి పోతాయట.ముఖ్యంగా ముఖానికి మెదడుకు నేరుగా గాలి తగిలి పలు రకాల సమస్యలు కూడా వెలుపడతాయని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. అలాగే నిరంతరం గాలి తగిలితే కండరాలు బిగుసుకుపోతాయట. అలాంటప్పుడు కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఇబ్బందులు లేకుండా ఉండవచ్చట. రాత్రిపూట ఫ్యాన్ ని చిన్నగా పెట్టుకొని పడుకోవడం చాలా మంచిది.. చల్లదనం కావాలనుకునే వారికి ఒక గిన్నెలో నీటిని పెట్టుకుని ఆ నీటితో అప్పుడప్పుడు తడిబట్టతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి.


నిద్రపోయే ముందు చల్లని నీటితో స్నానం చేయడం వలన సుఖంగా నిద్రపోవచ్చు మధ్యాహ్న సమయాలలో కిటికీలు తలుపులు మూసి ఉంచుకోవాలి దీని వలన వేడి లోపలికి రాకుండా ఉంటుంది. ఇదే సాయంత్రం వేళ కిటికీ తలుపులు తీసుకోవడం మంచిది. ఫ్యాన్ ఎక్కువగా ఈ వేడికి ఉపయోగించకపోవడమే చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ఎంత వేడిగా ఉన్నా సరే దుస్తులు లేకుండా మాత్రం నిద్రపోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. దుస్తులు లేకుండా నిద్రపోవడం వలన అలర్జీతో వచ్చే హై ఫీవర్ చాలా ప్రమాదకరమని తెలియజేస్తున్నారు. జ్వరంతో వేడితో బాధపడేవారు ఫ్యాన్ స్పీడ్ పెట్టుకోకుండా పడుకోవడం చాలా మంచిదట. ఫ్యాన్స్ వీడు ఎక్కువసేపు పెట్టుకుంటే ఫ్యాన్ కింద కూడా చాలా వేడిగా అనిపిస్తుంది. దీంతో మరింత వేడి ఎక్కువగా అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: