వర్షా కాలం వచ్చేసింది. ఈ కాలంలో అందరు ఎదుర్కొనే సమస్య బట్టలు సరిగ్గా ఆరక దుర్వాసన కొట్టడం. ఈ సమస్య ఎంతగానో వేధిస్తూ ఉంటుంది.ప్రస్తుతం వర్షాకాలం కావడం వల్ల వానలు బాగా కురుస్తూనే ఉన్నాయి. దీంతో రోడ్లపై నీరు ఉండటం వల్ల చాలా మంది బయటకు రావాలంటేనే చాలా అసహనం వ్యక్తం చేస్తుంటారు.ఇంకా అలాగే ఆరబెట్టిన బట్టలు కూడా వర్షాలకు ఆరవు. వారం రోజులు గడిచినా కూడా అలాగే చల్ల చల్లగా ఉంటాయి. ఒక్కోసారి ఆరిన బట్టలు కూడా ఎక్కువగా దుర్వాసన వస్తుంటాయి. ఇలాంటి వాసనలు వదిలించుకోవటం చాలా కష్టం.ఎంత పర్‌ఫ్యూమ్ కొట్టినా కానీ, ఆ వాసన అసలు పోనే పోదు. దీంతో వాటిని వేసుకుని బయటకు వెళ్లలేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బట్టలకు ఉన్న వాసనను వదింలించలేక పోతారు. ఇక అలాంటి సమయంలో ఈ టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా దుర్వాసన మాయమవడంతో పాటు సువాసనలు కూడా వెదజల్లుతాయి.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మీ డిటర్జెంట్‌లో బేకింగ్ సోడా ఇంకా వెనిగర్ కలిపి దానితో బట్టలు ఉతకడం వల్ల బట్టలు తాజాగా ఉంటాయి. అలాగే దుర్వాసన కూడా సులభంగా తొలగిపోతుంది.అలాగే సర్ఫ్‌లో, నిమ్మరసం కలుపుకుని బట్టలు ఉతకడం వల్ల దుర్వాసన రాకుండా ఉంటుంది.ఇక నిమ్మరసం దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను ఈజీగా చంపుతుంది.అలాగే వర్షాకాలంలో కపోర్డ్స్‌ల్లో ఉన్న బట్టల మధ్య కర్పూరం ఉంచడం వల్ల బట్టల దుర్వాసన పోతుంది. ఆ బట్టలు ఆరబెట్టిన చోట సాంబ్రాణి పొగ వేస్తే కూడా సువాసన అనేది వస్తుంది. ఇక, డ్రింకింగ్ వోడ్కాను ఖాళీ స్ప్రే బాటిల్‌లో వేసి బట్టల చుట్టూ స్ప్రే చేయడం వల్ల బట్టల దుర్వాసన ఈజీగా పోతుంది.మీకు మీ తాజాగా, సువాసనను వెదజల్లుతూ ఉంటాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ ట్రై చెయ్యండి. వర్షాకాలంలో మీ బట్టలు అస్సలు దుర్వాసన కొట్టవు.తాజాగా ఉంటాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: