ఈ మధ్యకాలంలో చాలా మంది మొబైల్ ఫోన్ లేనిదే పూట గడవదు అన్నట్టుగా వుంటున్నారు.మరి ముఖ్యంగా యువత ఫోన్ లేనిదే ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదు పెట్టుకోరు.ఇందులో పాటలు వినడానికి, సినిమాలు చూడడానికి,మాట్లాడడానికి ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతూ ఉన్న వారిలో యూత్ ఎక్కువగా వున్నారు.ఈ ఇయర్ ఫోన్స్ ని చెవిలో పెట్టుకొని రోడ్డుపై నడుస్తూ పక్కన వారిని గమనించుకోకుండా వారి ప్రాణాలను సైతం అర్పిస్తూ ఉన్నారు.ఇలాంటి ఘోరాలే కాక,ఇయర్ ఫోన్స్ వాడే వారికి ఇంకొన్ని గుండె పేల్చే నిజాలు ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.అసలు ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

పంక్షన్ లలో,మీటింగ్ లలో dj ప్లే చేస్తుంటారు.సాధారణంగా 60 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం హానికరం.70 నుండి 80 డెసిబుల్స్ మధ్య ధ్వనిని తరుచూ వినడం వలన చెవుడు వస్తుంది.నెలలో 20 సార్లు 20 నిమిషాల పాటు 90 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం వింటే వినికిడి సమస్యలు ఏర్పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.ఇలానే వినికిడి లోపం గుర్తించక చికిత్స చేయకపోతే,అది శాశ్వత అనారోగ్యానికి దారి తీస్తుంది.

అంతేకాక తరచూ ఇయర్ ఫోన్స్ తో సౌండ్ వినే వారికి మెదడులోని కణాలు సౌండ్ కి అలవాటు పడిపోయి డిజినెస్ లేకుంటే వారు బతకలేరు అన్న స్టేజ్ కి వెళ్లిపోతారు.ఇంకా చెప్పాలి అంటే 8,9 సంవత్సరాల కంటిన్యూస్గా ఇయర్ ఫోన్స్ వాడడం వల్లచాలా ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.ఇలా సౌండ్లను తరచూ వినడం వల్ల చిరాకు,కోపం,తరుచూ ఇయర్ పెయిన్, తలనొప్పి,మైగ్రెన్,జ్ఞాపకశక్తి దెబ్బ తినడం,కాన్సన్ట్రేషన్ లేకపోవడం,గుండె దడ,అధిక బిపి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మరియు ఈ మధ్యకాలంలో పిల్లలు కూడా ఇయర్ ఫోన్స్ వాడటం మొదలుపెట్టారు.ఇలాంటి పిల్లల్లో కచ్చితంగా క్రూయల్ మెంటాలిటీ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందట.కావున ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన తెచ్చుకొని ఇయర్ ఫోన్స్ వాడకపోవడం చాలా ఉత్తమం

మరింత సమాచారం తెలుసుకోండి: