
సబ్జ గింజలు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడతాయి, యూరిన్‌ను క్లీన్ చేస్తాయి, దీంతో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. సబ్జ గింజలు నీటిలో నానబెట్టి తింటే శరీరానికి తక్కువ కేలరీలు అందుతాయి కానీ ఎక్కువ సంతృప్తిని కలిగిస్తాయి. ఇది ఎక్కువ తినకుండా నయం చేస్తుంది. దీనివల్ల బరువు తగ్గే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇది ముఖ్యంగా PCOD ఉన్నవారికి ఉపయోగపడుతుంది. సబ్జ గింజల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మం మీద ముడతలు, మొటిమలు, చర్మమందబడి పోవడం వంటి సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. బాగా ఫైబర్ ఉన్న సబ్జ గింజలు జీర్ణవ్యవస్థను చక్కబెడతాయి. అతి తిన్నపుడు వచ్చే మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
పిండిపదార్థాలు ఎక్కువగా తినే ఆడవారికి ఇవి తప్పకుండా ఉపయుక్తంగా ఉంటాయి. సబ్జ గింజల్లో లొహం కూడా కొంతమేర ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తహీనత ఉన్న మహిళలు వీటిని తినడం వల్ల ఉపయోగం పొందగలరు. మెనోపాజ్ దశలో శరీరంలో వేడి, మూడ్ స్వింగ్స్, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు వస్తుంటాయి. సబ్జ గింజలు శరీరాన్ని కూల్ చేస్తాయి, మానసిక ఆందోళన తగ్గిస్తాయి. 1 టీస్పూన్ సబ్జ గింజలు 1 గ్లాస్ నీటిలో 15 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత జ్యూస్, పాలు, లెమన్ వాటర్ లేదా సోంపు నీటిలో కలిపి తాగొచ్చు. రోజుకు ఒకసారి లేదా రెండు సార్లు తినవచ్చు. అయితే అధికంగా తినకూడదు. గర్భిణీలు, తల్లిగా మారిన మహిళలు తప్పనిసరిగా డాక్టర్ సలహాతో మాత్రమే తినాలి. ఎక్కువగా తింటే మలబద్ధకం, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ నీటిలో నానబెట్టిన తరువాత మాత్రమే తినాలి.