
వేడి నీరు మెటబాలిజం వేగాన్ని పెంచుతుంది. కొవ్వు కరుగడానికి ఇది సహాయపడుతుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది, అలా అధికంగా తినడం తగ్గుతుంది. వేడి నీరు వాస్క్యులర్ సిస్టమ్‌ను రిలాక్స్ చేస్తుంది. రక్తనాళాల్లో రక్తప్రసరణను మెరుగుపరచడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది. వేడి నీరు తాగడం వల్ల శరీరం ప్రశాంతంగా, రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. మూడ్ బాగుంటుంది, ఆందోళన తగ్గుతుంది. ఉదయాన్నే వేడి నీరు తాగడం వల్ల ఆంత్రాలు యాక్టివ్ అవుతాయి. మలవిసర్జన సులభంగా జరుగుతుంది. కడుపు మెల్లగా శుభ్రమవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. వేడి నీరు రక్తప్రసరణ మెరుగుపరచడంతో పాటు టాక్సిన్లను బయటకు పంపుతుంది.
ఫలితంగా చర్మం క్లీన్, కాంతివంతంగా మారుతుంది. ఆహార శోషణను మెరుగుపరిచే గుణంతో పాటు హార్మోన్ లెవెల్స్‌ను సరి చేస్తుంది. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఉపశమనం కలుగుతుంది. వేడి నీరు నాడీ వ్యవస్థను రిలాక్స్ చేయడం వల్ల తలనొప్పులు తగ్గుతాయి. మైగ్రేన్ సమస్య ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరం. మలబద్దకం, ఆమ్లత, గ్యాస్ వంటి సమస్యలకు చెక్. రోజూ గోరువెచ్చని నీళ్లు తాగడం వలన ఈ సమస్యలు దూరమవుతాయి. కడుపు హెల్తీగా ఉంటుంది.