ఎడమవైపు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేదం, యోగ శాస్త్రం, ఆధునిక వైద్య శాస్త్రం కూడా చెబుతున్నాయి. దీనివల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. కడుపు ఆకారం ఎడమవైపు వంగినట్టుగా ఉంటుంది. అందువల్ల ఆహారం సులభంగా కడుపు నుంచి చిన్నపేగులకు సరిగ్గా ప్రవహిస్తుంది. గ్యాసు, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి. మన హృదయం ఎడమవైపు ఉంటుంది. ఎడమవైపు పడుకుంటే రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. హృదయంపై ఉన్న ఒత్తిడి తగ్గి, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. లివర్ డిటాక్స్ కి సహాయపడుతుంది. మన కాలేయం కుడి వైపున ఉంటుంది. ఎడమవైపు పడుకుంటే అది సులభంగా టాక్సిన్స్‌ను శరీరం నుంచి బయటకు పంపుతుంది.

రక్తం శుద్ధికాగలదు, శరీరానికి తేజస్సు పెరుగుతుంది. గర్భవతి స్త్రీలు ఎడమవైపు పడుకుంటే బిడ్డకు తగిన రక్తప్రసరణ జరుగుతుంది. ప్లాసెంటాకు ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. గర్భధారణ సమయంలో వాపులు, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.లింఫ్ డ్రైనేజి మెరుగవుతుంది. శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లడానికి సహకరిస్తుంది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఎడమవైపు పడుకోవడం వల్ల మలవిసర్జన కూడా సహజంగా జరుగుతుంది. గ్యాస్, శరీరంలో ఉండే ఆమ్లాలను బయటకు పంపే ప్రక్రియ వేగవంతమవుతుంది. భోజనం చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఎడమవైపు మడతపెట్టి పడుకుంటే జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది.

 ఇది ఏవైనా మందులు తీసుకున్నప్పుడు అవి సరిగ్గా శోషించడానికి సహాయపడుతుంది. భోజనం తర్వాత తక్షణమే పడుకోకూడదు. కనీసం 20-30 నిమిషాలు గడిచాకే పడుకోండి. ఎడమవైపు పదే పదే పడుకోవడం వల్ల కొన్నిసార్లు భుజానికి ఒత్తిడి పడవచ్చు. మృదువైన దిండుతో మద్దతు ఇవ్వండి. ఎడమవైపు పడుకోవడం అనేది ఒక చిన్న జీవనశైలి మార్పే అయినా దీని ప్రభావం చాలా గొప్పది. ఇది జీర్ణవ్యవస్థ, గుండె, కాలేయం, గర్భధారణ, మలవిసర్జన ఇలా ఎన్నో అంశాలలో మేలును ఇస్తుంది. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే సమయంలో ఎడమవైపు పడుకునే అలవాటు చేసుకుంటే శరీరానికి గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: