మనిషికి ముఖ్యంగా కావలసింది నీరు - తిండి - నిద్ర.  ఈ మూడు ఉంటే మనిషి హెల్తీగా హ్యాపీగా ఉంటాడు . మనం రోజంతా కష్టపడి సంపాదించే ది కడుపునిండా తినడానికి కంటి నిండా నిద్రపోవడానికి. హెల్తీగా ఆరోగ్యకరంగా ఉండడానికి . కానీ ఈ మధ్యకాలంలో  నిద్ర - తిండిని కూడా మర్చిపోయి ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి అంటూ రాత్రి - పగలు తేడా లేకుండా పూర్తిగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మరి డబ్బులు సంపాదించేస్తున్నారు . అయితే అంత కష్టపడి సంపాదించిన డబ్బు మనం లేకపోతే దేనికి ఉపయోగం..?? అనేది గుర్తుంచుకోవాలి..!


అయితే మనిషి సరిగ్గా పనిచేయాలి అన్నా.. హెల్దిగా ఉండాలి అన్నా.. తిండి నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ . కరెక్ట్ గా సరైన సమయానికి తినేయడం సరైన సమయానికి పడుకోవడం చాలా చాలా గుడ్ హ్యాబిట్స్ అని డాక్టర్లు చెబుతూ ఉంటారు . కానీ కొంతమంది మాత్రం తిండి నిద్రను ఎక్కువగా కేర్ చేయరు. ఆకలేసినప్పుడు తింటాంలే.. నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాం లే అంటూ నెగ్లెట్ చేస్తూ ఉంటారు . అయితే నేటి కాలం జనాలు  నిద్ర మేల్కొని ఎక్కువగా ఫోన్ లో రీల్స్ చూస్తూ.. ఓటీటిలో వెబ్ సిరీస్ లు అంటూ సినిమాలు అంటూ టైం పాస్ చేస్తున్నారు . రాత్రి 12 దాటినా కూడా పడుకోవట్లేదు . అది చాలా చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు . అర్ధరాత్రి వరకు మేలుకొని ఉండడం వల్ల ఉబయకాయం.. మధుమేహం లాంటి అనేక ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తాయి అంటున్నారు .



నిద్ర టైం సరిగ్గా లేకపోతే సమస్యలు ఎదుర్కోవాలి. చాలామందికి  అసలు ఏ టైంలో నిద్ర పోవాలి అనేది కూడా తెలియదు . సరైన సమయంలో నిద్ర పోవడం చాలా చాలా ముఖ్యం . కాగా రాత్రి 7:00 తర్వాత మెలోటిన్  అనే కెమికల్ రిలీజ్ అవుతుంది . ఇది రిలీజ్ అయిన తర్వాత పడుకోవడం చాలా మంచిది అంటున్నారు నిపుణులు.  అంటే సుమారు రాత్రి 7 గంటల నుంచి పది గంటల వరకు ఇది విడుదలవుతూ ఉంటుందట . ఏడు గంటల నుంచి కొద్దికొద్దిగా విడుదలవుతూ రాత్రి 10 గంటలకు ఫుల్ గా రిలీజ్ అయిపోతుంది. ఈ సమయంలోపు పడుకుంటే చాలా చాలా మంచిది అంటున్నారు నిపుణులు.  రాత్రి ఒంటి గంట తర్వాత రిలీజ్ అవ్వదు . కనుక ఆ టైంలో పడుకున్నా మనకి చాలా చాలా ప్రమాదకరం అంటున్నారు.  ఈ మెలోటిన్ అనేది మీ బ్రెయిన్  మంచిగా విశ్రాంతి తీసుకునేలా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు .



ఇది రిలీజ్ అవుతున్న టైంలో పడుకుంటే శరీరానికి రెస్ట్ లభిస్తుంది . మెదడు కూడా విశ్రాంతిగా ఉంటుంది . మళ్ళీ తెల్లవారక మీ వర్క్ లైఫ్ స్టైల్ ను ఈజీ చేస్తుంది . అలా కాకుండా ఇప్పుడేగా తిన్నాం . కొంచెం సేపు టీవీ చూస్తాం. రీల్స్ చూస్తాం ..టీవీ షోలు చూస్తామంటూ రాత్రి 12:00 వరకు టైం వేస్ట్ చేశారా..? నిద్రపోకుండా ఉన్నారా..? అంతే మీ ఆరోగ్యం పూర్తిగా చెడిపోవడానికి అదే మొదటి స్టెప్ అంటున్నారు నిపుణులు. కనుక రాత్రి 7 లోపు భోజనం చేసేసి 7:30 - 8:30 - 9:30 ప్రాంతంలో పడుకోవడం చాలా చాలా మంచిది అంటున్నారు నిపుణులు.  ఆరోగ్యమే మహాభాగ్యం . డబ్బులు కావాలి అంటే ఎవరైనా అప్పు ఇస్తారు ఆరోగ్యం కావాలి అంటే అప్పు ఇస్తారా..? మన హెల్త్ మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేకాదు మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు సరిగ్గా టైం కి తిని  టైం కి నిద్ర పోతే (వందేళ్లు) నిండు నూరేళ్లు ఆయుష్షు ఉంటుంది అని.. దాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నారు నిపుణులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: