
రి ముఖ్యంగా ముసలి వాళ్లు .. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో 24 గంటలు ఏసీ రన్ అవుతూనే ఉంటుంది. అయితే ఇది మరింత ప్రమాదకరం అంటూ హెచ్చరిస్తున్నారు డాక్టర్లు . ఎక్కువ ఏసీలో ఉండడం వల్ల అనేక జబ్బులకు కూడా గురి అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు . ఏసీలో ఉండడం వల్ల ఆ టెంపరేచర్ కి ఎక్కువగా అలవాటు పడిపోతూ ఉంటారు . బయట కి వచ్చి కొంచెం సేపు కూడా ఉండలేరు . చెమటలు పట్టేయడం చిరాకు అనిపిస్తూ ఉంటుంది . రోజంతా ఎయిర్ కండిషన్ గదిలో ఉండడం వల్ల శరీరం చల్లటి వాతావరణానికి అలవాటు పడిపోతుంది. అదే కోరుకుంటుంది .
ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. నిపుణుల ప్రకారం ఎక్కువ సేపు ఏసీలో ఉండడం వల్ల ఎముకలకు హానికరం . తక్కువ ఉష్ణోగ్రతతో ఎక్కువసేపు ఉండటం వల్ల మన ఎముకలు బాగా బలహీన పడిపోతాయట . అలాగే కీళ్ల నొప్పులు కూడా పెరుగుతాయట . ఏసీలో ఉన్న వారిలో ఎముకులు బలహీనపడడానికి మెయిన్ రీజన్. నిరంతరం లేదా ఎక్కువసేపు తక్కువ ఉష్ణోగ్రతలో ఉండడమే దానివల్ల శరీర జీవక్రియ క్రమంగా మందగించడం ప్రారంభమవుతుంది అంటున్నారు నిపుణులు . ఇది ఎముకలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుందట . ఈ స్థితిలో ఎక్కువసేపు ఉండడం వల్ల ఎముకలు బలహీనపడతాయి . అదే విధంగా కీళ్ల నొప్పులు పెరుగుతాయి అంటూ నిప్పులు హెచ్చరిస్తున్నారు. ఎముకలు బలహీనపడకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీలైనంత ఎక్కువ నీళ్లు తాగడానికి ప్రయత్నించాలి అంటున్నారు డాక్టర్లు .
అలాగే ఆకుపచ్చని కాయగూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండటం బెటర్ అంటున్నారు. ఏసీలో ఎక్కువసేపు కాకుండా పరిమిత సమయం మాత్రమే ఉంటే బాగుంటుంది అప్పుడు ఆరోగ్యానికి ఎటువంటి ప్రాబ్లం రాదు అంటూ సజెస్ట్ చేస్తున్నారు . కనుక ఎవరైతే గంటల గంటలు ఏసి రూమ్ లో ఉంటున్నారు వాళ్లు కొంచెం సేపు బయట వచ్చి తిరగడానికి లేదా ఏసీ ఆఫ్ చేసుకుని ఉండడానికి అలవాటు పడితే మంచిది అంటూ కామన్ పీపుల్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు..!
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కొందరి నిపుణులు చెప్పిన ఆధారంగానే ఇవ్వబడింది. మీరు ఏదైనా సలహాలు పాటించే ముందు మీ డాక్టర్ ని సంప్రదించడ ఉత్తమం అని గుర్తు పెట్టుకోండి..!