
ఇనుప వస్తువులు:
శాస్త్రాన్ని అనుసరించి ఇనుముతో చేసిన వస్తువులు ఎట్టి పరిస్థితిలోనూ శనివారం కొనుగోలు చేయకూడదు అంటున్నారు పండితులు . ఇది శనికి కోపం కలిగించే విషయమట . ఒకవేళ పొరపాటున కొనుక్కున్న ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుందట .
ఉప్పు:
శనివారం రోజున ఉప్పును అస్సలు కొనుగోలు చేయకూడదు అంటున్నారు పండితులు . మన ఇంట్లోని పెద్దవాళ్ళు కూడా ఇదే చెబుతూ ఉంటారు. శనివారం ఉప్పు కొంటే అప్పుల పాలు అవుతారు అని ఒక సామెత కూడా ఉంది .
నల్ల నువ్వులు: శనివారం నల్ల నువ్వులు కొనకూడదు అంటూ పండితులు చెబుతున్నారు . నల్ల నువ్వులు కొనడం వల్ల సమస్యలు మరింత ఎక్కువ అవుతాయట. ఏ పనైనా చేయాలి అనుకుంటే అది లేట్ అయిపోతుందట. ఆటంకం కలుగుతుందట.
చెప్పులు: శనివారం పూట చెప్పులు కూడా కొనుక్కోకూడదు అంటున్నారు పండితులు. అది మహా మహా దరిద్రం అంటున్నారు .
కత్తెర: శనివారం కత్తెర కొనడం మహా మహా పాపమట. కత్తెర బహుమతిగా ఇవ్వడం అశుభం . ఇది కుటుంబంలో బంధుమిత్రులకు తగాదాలు కూడా తీసుకొస్తుందట . మరి ముఖ్యంగా కత్తెర కొనడం వల్ల భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారు అనే విధంగా కూడా జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు . పెద్దవాళ్ళు అలాగే చెప్తూ ఉంటారు. శనివారం పూట కత్తెర కొంటె భార్యాభర్తల మధ్య కలహాలు వస్తాయట.
అంతేకాదు శనివారం పూట అగ్గిపెట్టి - బొగ్గు - సూది - నలుపు రంగు సంబంధించిన వస్తువులు .. గుమ్మడికాయ అస్సలు కొనకూడదట . ఇంటికి తీసుకురాకూడదట. ఏదైనా అర్జెంట్ అనిపిస్తే ముందు రోజే కొనుక్కోవాలి తప్పిస్తే శనివారం అస్సలు కొనుకోకూడదు అంటున్నారు పండితులు.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే అని పాఠకులు గుర్తుంచుకోవాలి . ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుంటే మంచిది..!!