మనం ఎప్పుడు పుట్టాలి.. ఎప్పుడు మరణించాలి అనేది మన చేతుల్లో అస్సలు ఉండదు. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా సరే కొందరు క్యూరియాసిటీతో తమ జీవితకాలం తెలుసుకోవడానికి రకరకాల పద్ధతులను ఫాలో అవుతూ ఉంటారు.  మరి ముఖ్యంగా కొంతమంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లి మేము ఎంత కాలం బతుకుతాం..? అనే విధంగా కూడా అడిగే జనాలు మనలో ఎంతోమంది ఉంటారు . మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ మనం ఎంత కాలం జీవించగలమో తెలుసుకోవాలని క్యూరియాసిటీతో కొంతమంది రకరకాల విధానాన్ని ఫాలో అవుతూ ఉంటారు . కానీ మనం ఎంత కాలం జీవించగలమని ఎవరినైనా సరిగ్గా అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే "జీవితం మరణం రెండూ కూడా మన చేతుల్లో లేవు ఆ దేవుడు ఎప్పుడో నిర్ణయించేస్తుంటాడు" అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు.


ఇక నేటి జనరేషన్ అయితే పవన్ కళ్యాణ్ డైలాగ్ ని కొడుతూ" భూమ్మీదికి వచ్చిన ప్రతివాడు గెస్టే.. ఎప్పుడో ఒకసారి వెళ్లి పోవాల్సిందే" అంటూ చెప్తూ ఉంటారు. మరికొందరు రకరకాల పద్ధతులను అనుసరించి మీ జీవితకాలం .. ఇది మీరు ఇంత కాలం బతుకుతారు అని చెబుతూ ఉంటారు . కాగా ఓ టెస్ట్ కి సంబ్మధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి. అదే సిట్టింగ్-రైజింగ్ టెస్ట్. మనం కింద కూర్చొని లేచే విధానాన్ని బట్టి మన బాడీ స్టామినా ఏంటి ..? మన బాడీ కండిషన్ ఏంటి..? అనే దాని బట్టి ఓ స్లోర్ ఇస్తారు. దాని ద్వార మనం ఎన్ని రోజులు బ్రతకగలం అనే విషయాలను ఈజీగా చెప్పేయచ్చు అంటున్నారు నిపుణులు.


సిట్టింగ్ రైసింగ్ టెస్ట్ అనేది ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది.  కండల బలం ..వాటి మృదుత్వం ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తారట.  బ్రేజిల్ లోని ఓ పరిశోధకుల బృందం తాజాగా 46 నుండి 75 వయసు మధ్య ఉన్న దాదాపు 4300 మందికి పైగా ఈ అధ్యాయం చేసినట్లు బయటపడింది . వీరికి జీరో నుండి 5 వరకు స్కోర్ కేటాయించింది.  తద్వారా నిల్చోవడానికి.. కూర్చోవడానికి..  మోకాలికి వేరే వారి సహాయాన్ని గాని తీసుకున్న వాళ్లు స్కోర్ నుంచి ఒక పాయింట్ను కదలికల్లో స్థిరత్వం లేని వారికి 0.5. తగ్గిస్తూ వచ్చింది. ఇలా 12 ఏళ్ల పాటు వారిని గమనిస్తూ వచ్చింది. ఈ వ్యవధిలో 665 మరణాలు సంభవించాయట.



ఇది నిజంగానే షాక్. తక్కువ స్కోర్ ఉన్న వారికి అధిక మరణ ప్రమాదం ఉంటుంది అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు . వీరి వరణ రేటు 42% అధిక స్కోర్ నమోదైన వారి మరణ రేటు 3.7 స్థానం ఉన్నట్లు అధ్యయనం పరిశోధకులు గుర్తించారు.  రెండు గ్రూపులను పోల్చి చూస్తే తక్కువ స్కోరు ఉన్నవారు గుండెజబ్బులతో మరణించే అవకాశం దాదాపు 500% ఎక్కువగా ఉందని ..సహజ మరణం సంభవించే అవకాశం 300% మాత్రమే ఉంది అని చెప్పారు.  గత 25 ఏళ్లలో సమాజంలో వేరువేరు వర్గాలపై ఈ పరీక్ష చేసి ప్రయోగించగా ఇది అత్యంత సులభమైన అలాగే సంపూర్ణమైన పరీక్షా అని వాళ్ళు వివరించారు . దీంతో ఇప్పుడు ఈ పద్ధతిని తెలుసుకోవడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . మరీ ముఖ్యంగా నేటి జనరేషన్ మొత్తం కూడా హెల్త్ ని పాడుచేసుకుంటుంది.  బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ తింటూ 20 - 30 ఏళ్లకి షుగర్ బీపీ అని 35 ఏళ్లు రాకముందే మోకాళ్ళ నొప్పులు అని మంచిగా ఉన్న ఆరోగ్యాన్ని చేతులారా  యువత పాడు చేసుకుంటుంది అంటూ కొంతమంది డాక్టర్లు మండిపడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: