గుండె అనేది మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సరైన జీవనశైలి, వ్యాయామం, మరియు ముఖ్యంగా సరైన ఆహారం అవసరం. కొన్ని ఆహార పదార్థాలు గుండెకు మేలు చేస్తాయి, గుండెపోటు, హై బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యల బారిన పడకుండా కాపాడతాయి. వ్పుచ్చకాయ, ఎక్కువ నీరు, పొటాషియం, అర్జినైన్ వంటి పోషకాలు ఉండే ఈ పండు గుండె నాళాలను శుభ్రపరుస్తుంది. గుండెకు కావలసిన హైడ్రేషన్ కలిగిస్తుంది. బాదం, ఇవి హెల్తీ ఫ్యాట్స్ మోనో అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాట్స మరియు విటమిన్ E అధికంగా కలిగి ఉంటాయి.

హైడెన్సిటీ లిపోప్రొటీన్స్  పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వాల్‌నట్స్, వాల్‌నట్స్‌లో ఓమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. ఇది గుండె నాళాల్లో ఇన్ఫ్లమేషన్‌ తగ్గిస్తుంది. ఓట్స్, ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే రకమైన ఫైబర్ ఉండి, ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయానికి ఓట్స్ తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. విటమిన్ K, నైట్రేట్స్ ఉండే ఇవి రక్తనాళాల పనితీరు మెరుగుపరుస్తాయి. బిపి కంట్రోల్ చేస్తాయి. బీట్రూట్, నైట్రేట్లు అధికంగా ఉండి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. బీపీ తగ్గించడంలో, గుండె పనితీరు మెరుగుపరచడంలో బీట్రూట్ కీలకం.

అవకాడో, ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు పొటాషియం కలిగి ఉంటుంది. గుండెను రక్షించే హైడెన్సిటీ కొలెస్ట్రాల్ పెంచుతుంది. ఇవి ఓమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్‌తో నిండి ఉంటాయి. గుండె బలహీనతను తగ్గించడంలో, రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి, గుండె నాళాలను రక్షిస్తాయి. దాల్చిన చెక్క, ఇది బీపీ తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. రోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయాలి. పొగతాగే అలవాటు ఉంటే మానేయాలి. రోజూ 6-8 గ్లాసుల నీరు తాగాలి. ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం, ప్రాణాయామం చేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: