
బెల్లం శరీరంలో వాయు నివారణకు సహాయపడుతుంది. రాత్రి భోజనం తర్వాత తీసుకుంటే వంటి సమస్యలు తగ్గుతాయి. బెల్లం శరీరంలో పేరుకున్న విషాలను బయటకు తీసేందుకు సహాయపడుతుంది. ఇది సహజమైన డీటాక్సిఫైయింగ్ పదార్థం. ఉదయాన్నే శుభ్రతతో నిద్ర లేచేందుకు బెల్లం సహాయపడుతుంది. బెల్లం తినడం ద్వారా రక్తంలో ఉండే మలినాలు తొలగిపోతాయి. ఇది స్కిన్‌కు కూడా మంచిది, మొటిమలు, చర్మ సమస్యలు తగ్గుతాయి. బెల్లంలో ఉండే ఐరన్, మగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
రాత్రి తిన్న తరువాత తినడం ద్వారా శరీరానికి సహజ రక్షణ పెరుగుతుంది. బెల్లం ఐరన్ లో పుష్కలంగా ఉండే కారణంగా ఇది హేమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. రాత్రి తినడం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావడంలో సహాయం చేస్తుంది. రాత్రి భోజనం తరువాత మళ్ళీ మిఠాయిలు, స్వీట్స్ తినాలనే కోరిక ఉంటే, బెల్లం చిన్న ముక్క తింటే చాలు. ఇది సహజమైన మధురతను ఇస్తుంది, బాగా తృప్తిగా అనిపిస్తుంది. బెల్లం సహజమైన కఫం నివారిణిగా పనిచేస్తుంది. రాత్రి తీసుకోవడం వల్ల శరీరాన్ని అంతర్గతంగా వేడిగా ఉంచుతుంది. రాత్రి సమయంలో జలుబు వచ్చే వారికి ఇది మంచి ఔషధం లాంటి ఉపయోగం చేస్తుంది. బెల్లం తీసుకోవడం వల్ల పొట్టలో ఉన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది ఉదయం మల విసర్జన సాఫీగా జరగేందుకు సహాయపడుతుంది.