
చాలామంది అనుకుంటూ ఉంటారు .. భర్త లేని మహిళలు పూజలు చేయకూడదు, వారు వితంతువులు కనుక పూజా మందిరంలోకి అడుగు పెట్టకూడదు, గుడికి వెళ్లకూడదు అని. చాలా చోట్ల ఇలాంటి ఆంక్షలు కూడా ఉన్నాయి. కానీ అది పూర్తిగా తప్పు. ఏ శాస్త్రాలలో కూడా భర్తలేని మహిళలు పూజ చేయకూడదు అన్న నియమాలు లేవు. మరీ ముఖ్యంగా వినాయకుడి విషయంలో అలాంటి పాటింపులు అసలు లేవని పండితులు చెబుతున్నారు. భర్తలేని మహిళలు కావచ్చు, విడాకులు తీసుకున్న మహిళలు కావచ్చు .. వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజించవచ్చు, దీపం వెలిగించవచ్చు, వినాయక చవితిని జరుపుకోవచ్చు. పిండి పదార్థాలు చేసి, ధూపదీపాలతో నైవేద్యాలు సమర్పించి వినాయకుడిని పూజించవచ్చు.
శాస్త్రం ప్రకారం వినాయకుడిని విఘ్ననాశకుడు అని పిలుస్తారు. ఆయన అందరికీ పూజ చేయదగిన దేవుడు. వయస్సు, లింగం, వివాహ స్థితి అనే భేదం లేకుండా ఎవరు కావాలన్నా ఆయనను పూజించవచ్చు. భక్తిశ్రద్ధలతో పూజిస్తే ప్రతి కోరికను నెరవేర్చుతాడని నమ్మకం. దీపం వెలిగించడం చాలా శుభప్రతీకం. ఎవరైనా దీపం వెలిగించవచ్చు. పూర్వకాలంలో కొన్ని ఆచారాలు సామాజికంగా ఏర్పడ్డాయి. వితంతువులు పండుగలో పాల్గొనకపోవడం, భర్తలేని మహిళలు గుడికి వెళ్లకుండా చేయడం .. ఇవన్నీ సామాజిక సంప్రదాయాలు మాత్రమే. శాస్త్రాలలో అలాంటి నియమాలు లేవు. వినాయకుడిని భక్తిశ్రద్ధలతో ప్రతి ఒక్కరూ పూజించవచ్చు అని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా విడాకులు తీసుకున్నవారు లేదా తోడు లేక బాధపడుతున్నవారు వినాయకుడిని పూజిస్తే వారికి మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, సంతానం లేని వారికి సంతానం, కుటుంబ చికాకులతో ఇబ్బంది పడుతున్న వారికి శాంతి ప్రసాదించే శక్తి వినాయకుడి దగ్గర ఉంది. ఆయనను భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి అని పండితుల అభిప్రాయం.
నోట్: ఈ వార్తలో ఇవ్వబడిన సమాచారం కొంతమంది పండితుల అభిప్రాయాలే. ఇది మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పండితులు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇది ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత అభిప్రాయం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. దీన్ని ఇండియా హెరల్డ్ ధృవీకరించలేదు.