గత ఏడాది నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఆ సినిమా పరాజయం చెందడంతో కొంత ఆలోచనలో పడ్డాడు. అనంతరం తనకు కెరీర్ లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి హిట్ సినిమాలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కె మరొక అవకాశం ఇవ్వడానికి ఫిక్స్ అయిన బన్నీ, ఫైనల్ గా ఆయనతో అలవైకుంఠపురములో అనే సినిమాని మొదలెట్టాడు. దాదాపుగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. 

 

ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు మూడు సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి విశేషమైన రెస్పాన్స్ ని అందుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా నుండి నాలుగవ సాంగ్ అయిన బుట్టబొమ్మ అనే పల్లవితో సాగె సాంగ్ టీజర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ప్రముఖ యువ సింగర్ అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ని అందించగా, ఎస్ ఎస్ థమన్ అద్భుతమైన ట్యూన్ ని అందించాడు. ఇక ఈ సాంగ్ టీజర్ ప్రస్తుతం యువతను బాగా ఆకర్షిస్తోంది. కాగా ఫుల్ సాంగ్ ని మరికొద్దిరోజుల్లో రిలీజ్ చేయనున్నారు. 

 

బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా బన్నీ కి అక్కగా సీనియర్ నటి టబు నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మురళి శర్మ, సునీల్, అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, జయరాం, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. కాగా ఎంతో భారీ ఖర్చుతో గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను ఎంతో భారీ గా నిర్మిస్తున్నాయి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: