
మొదట్లో సుజిత్ దర్శకత్వం వహిస్తాడని వార్తలు రాగ స్క్రిప్ట్ విషయంలో సంతృప్తిగా లేని వినాయక్ కు ఛాన్స్ ఇచ్చారని తెలుస్తుంది.. ఇక ఇది మలయాళ రీమేక్ సినిమా అని అందరికి తెలిసిందే.. అక్కడ సూపర్ హిట్ అయిన లూసిఫర్ కి ఈ సినిమా రీమేక్.. ఇప్పటికే ఈ సినిమా కి తగ్గ పనులు పూర్తయ్యాయి. మెగాస్టార్ సూచనలు, ఇన్ పుట్స్ కు అనుగుణంగా, లూసిఫర్ ను చాలా వరకు మార్చి తయారుచేసినట్లు తెలుస్తోంది.దర్శకుడు ఈ మధ్యనే రెండు రోజులు బెంగళూరులో మెగాస్టార్ ను కలిసి, ఫుల్ అండ్ ఫైనల్ నెరేషన్ ఇచ్చి వచ్చారు. దాంతో ఈ సినిమా కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి..
ఆచార్య సినిమా తర్వాత ఇది ఉంటుందని తెలుస్తుంది.. మరోవైపు బాబీ, మెహర్ రమేష్ లకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, లూసిఫర్ సెట్ మీదకు 2021 సమ్మర్ వేళకు మెగాస్టార్ వచ్చే అవకాశం వుంది. ఎప్పటి లాగే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ తో కలిసి ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తారు.ఇక ఈ సినిమాలో విలన్ గా రానా దగ్గుపాటి నటిస్తాడని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక మరో యంగ్ హీరో కూడా ఈ సినిమా లో నటించబోతున్నాడట.. ఇక వినాయక్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తో వారు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుండగా ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే..