పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏడాదిలో ఆరు నెలల పాటు సాత్విక్ ఆహారం తీసుకుంటారు. సాత్విక్ ఆహారం అనగా స్వచ్ఛమైన శాఖాహారం. ఆయన మాంసాహారం తక్కువగా తింటూ శాకాహార ఆహారపదార్థాలు ఎక్కువగా భుజిస్తారు. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో ఉండేలా పవన్ జాగ్రత్తలు తీసుకుంటారు. కాస్త కూడా బరువు పెరగకుండా ఆయన ఓ స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారు. తీరిక లేకుండా సినిమాలు, రాజకీయాల పనులలో నిమగ్నమైనప్పుడు మాత్రం సన్నగా తయారవకుండా ఆయన తన డైట్ లో బలవర్థకమైన ఆహారం ఉండేలా చూసుకుంటారు.


అయితే ఆయన పూర్తిగా శాఖాహారి కాదని సన్నిహితులు చెబుతుంటారు. ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భం లో ఆయన మాంసాహారం స్వీకరిస్తుంటారట. అయితే పవన్ కల్యాణ్ కి ఇష్టమైన ఆహారం నెల్లూరు చేపల పులుసు అని జర్నలిస్టులు చెబుతుంటారు. సీఫుడ్స్ అంటే కూడా పవన్ కు అత్యంత ఇష్టమట. పవన్ కల్యాణ్ నాటు కోడి కూర, పులిహోర కూడా అమితమైన ఇష్టం తో తింటారట. ఎంతో ఆరోగ్య స్పృహ కలిగిన పవన్ కల్యాణ్ 49 ఏళ్ల వయసులో కూడా అద్భుతమైన శారీరక దృఢత్వాన్ని కలిగి ఉన్నారు. అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ ప్రియమైన వంటకాల గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.


ఇక సినిమాల విషయానికొస్తే.. పవన్ కల్యాణ్ చిత్రీకరణల నుంచి విరామం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితే.. ఆయన తన తదుపరి చిత్రాలైన హరి హర వీర మల్లు, అయ్యప్పనమ్ కోషియం రీమేక్ చిత్రీకరణలను ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన తన కుమారుడు అకీరా నందన్ తో కలిసి కర్ణాటక సంగీతంలో ఓనమాలు దిద్దుతున్నారని ఇటీవల వార్తలు వెల్లువెత్తాయి. లాక్ డౌన్ సమయాన్ని కూడా పవన్ బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు అని తెలుస్తోంది. ఆయన కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: