ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల రేంజ్ పెరిగిందని తెలుస్తుంది.. ఒక సినిమాను దర్శకనిర్మాతలు కోట్లు పెట్టి మరి నిర్మిస్తున్నారని తెలుస్తోంది.. సినిమాలు కూడా వందల కోట్లను వసూలు చేస్తున్నాయని అందరికి తెలిసిందే.

దీంతో దర్శక నిర్మాతలు మరియు హీరోలు రెమ్యూనరేషన్ ను కూడా పెంచేశారని తెలుస్తుంది.ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలు ఒక్క సినిమాకు 50 నుంచి 70 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.అదేవిధంగా టాప్ డైరెక్టర్స్ కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారని సమాచారం.స్టార్ డైరెక్టర్స్ 10 కోట్ల వరకూ రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని తెలుస్తుంది..

స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు అయిన త్రివిక్రమ్ తప్ప మిగతా వారందరూ కూడా తక్కువ పారితోషికాన్ని పుచ్చుకుంటున్నారని తెలుస్తుంది.బోయపాటి శీను ఒక్క సినిమాకు 5 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం.ఇది ఇలా ఉంటే అఖండ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వాలని పెద్ద చర్చ నడిచిందని తెలుస్తుంది.బాలకృష్ణ బోయపాటి కాంబోలో వస్తుండడంతో సినిమా బ్లాక్ బస్టర్ ను అందుకుంటుందన్న నమ్మకం అందరికి వుంది. ఇదిలా ఉంటే బోయపాటి అఖండ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తుంది.

ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయంలో నిర్మాతకు దర్శకుడికి చాలా సందర్భాలలో గట్టిగానే చర్చలు జరిగాయని తెలుస్తుంది.. దీనితో అఖండ సినిమాకు ఇంత వరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలుస్తుంది.ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్లను బట్టి దర్శకుడికి షేర్స్ చేస్తారని తెలుస్తుంది.. ఇదే ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు లాభాల్లో వాటా తీసుకునేలా డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమా విడుదలైన వారం రోజులకే దాదాపు 80 కోట్ల వరకు కలెక్షన్ లను రాబట్టిందని తెలుస్తుంది..తరువాత ఎటువంటి బిగ్గెస్ట్ సినిమాలు లేకుంటే బాలయ్య హవా మాములుగా ఉండేది కాదు. కానీ పుష్ప వంటి బిగ్గెస్ట్ సినిమా రావడంతో అఖండ కలెక్షన్స్ తగ్గేలా వున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: