ఇలా ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశం నలుమూలల నుంచి కూడా కొరియోగ్రాఫర్లు కంటెస్టెంట్ లు వస్తూ ఉంటారు. ప్రతివారం అదిరిపోయే డాన్సులతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం మాత్రమే కాదు ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా ఒక సరికొత్త ఈవెంట్ ప్లాన్ చేశారు ఈ టీవీ నిర్వాహకులు. 'నా ఆట చూడు' అంటూ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్లాన్ చేసి దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఢీ షో లో కేవలం కంటెస్టెంట్ లు మాత్రమే డాన్స్ చేస్తే ఇక నా ఆట చూడు కార్యక్రమంలో మాత్రం ఏకంగా డాన్స్ మాస్టర్ లు కూడా కాలు కదపడం గమనార్హం. అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ కార్యక్రమంలోని ఒక్కో డాన్స్ పర్ఫార్మెన్స్ గూస్బంప్స్ తెప్పించే విధంగానే ఉంది అని చెప్పాలి. ఇక ఈ ప్రోమో చూసిన తర్వాత డాన్స్ అదిరిపోయింది భయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు ప్రతి ఒక్కరు. ఇది నెక్స్ట్ లెవెల్ డాన్స్ పర్ఫార్మెన్స్ అంటున్నారు మరికొంతమంది. ఈ కార్యక్రమం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము అంటూ కొంతమంది కామెంట్ లు పెడుతూ ఉండటం గమనార్హం.