కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు ఆయన తలపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో  హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తమిళంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ని తెలుగు లో డబ్ చేసి విడుదల చేయనున్నట్టు విజయ్ ఒకానొక సందర్భంలో తెలియజేశాడు.

ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో తలపతి విజయ్ సరసన నేషనల్  క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. కొంత కాలం క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయ్యింది. ప్రస్తుతం తలపతి విజయ్,  వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా విజయ్ కి కెరియర్ పరంగా 66 వ సినిమా. ఇప్పటి వరకు చిత్ర బృందం ఈ సినిమాకు టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  

అసలు విషయం లోకి వెళితే...  ఈ సినిమా టైటిల్ ను మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను తలపతి విజయ్ పుట్టినరోజు అయిన జూన్ 22 వ తేదీన చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే చిత్ర బృందం టైటిల్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ క్రేజీ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: