దర్శకుడు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది వేసేవి లో ఈ సినిమా ను విడుదల చేస్తున్నారు. అల వైకుంఠ పురంలో సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరి ఈ సినిమాను చేస్తున్నాడు త్రివిక్రమ్ మధ్యలో ఎన్టీఆర్ తో సినిమా చేయవలసి ఉంది కా నీ అ ది క్యాన్సల్ అయిపోవడంతో ఇప్పుడు మహేష్ బాబుతో సినిమాను శరవేగంగా షూటింగ్ చేస్తున్నాడు ప్రస్తుతం ఈ సినిమా యొక్క రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అవుతుం ది.

 ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ చేయబోయే తదుపరి సినిమా గురించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతున్నాయి. మొన్నటిదాకా ఈ దర్శకుడు తన తదుపరి సినిమాను అల్లు అర్జున్ తో చేయబోతున్నాడు అనే వార్తలు ఎక్కువగా వినిపించాయి ఇప్పటికే వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయాలు వచ్చాయి ఇప్పుడు నాలుగవ సినిమా ద్వారా వారి కాంబినేషన్లో భారీ విజయాలు అందుకోవాలని వారి అభిమానులు భావిస్తున్నారు తాజాగా త్రివిక్రమ్ తదుపరి సినిమా చేయబోయే విషయమై ఒక అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది.

రామ్ చరణ్ తో ఆయన తదుపరి సినిమాను చేయబోతున్నాడు అని చెబుతున్నారు. తొందర్లోనే దీనికి సంబంధించిన క్లారిటీ రాబోతుంది వీరిద్దరూ మాత్రమే కాకుండా త్రివిక్రమ్ విజయ్ దేవరకొండ తో కూడా సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు మరి మహేష్ బాబు సినిమా పూర్తి అయిన తర్వాత ఏ హీరో అందుబాటులో ఉంటే ఆ హీరో తోనే ఆయన సినిమా చేస్తాడు అని త్రివిక్రమ్ సన్నిహితులు చెబుతున్నారు. ఇకపోతే మహేష్ సినిమా పైనే ఆయన పూర్తి దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని వీరు ఇరువురు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: