పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ "అజ్ఞాతవాసి" మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అందులో భాగంగా ఇప్పటికే వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ మూవీ లతో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను పలకరించి మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ నుండి కొత్త గిమ్స్ వీడియోను డిసెంబర్ 31 వ తేదీన చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. 

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ యూనిట్ మరికొన్ని రోజుల్లోనే ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే హరిహర వీరమల్లు మూవీ నుండి పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక గ్లిమ్స్ వీడియోను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఆ వీడియోకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు మూవీ పై కళ్యాణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: