‘వీరసింహా రెడ్డి’ బాలకృష్ణ కెరియర్ లో ఎప్పుడు చూడని కలక్షన్స్ ను అందించడంతో బాలయ్య మంచి జోష్ లో ఉన్నాడు. ఈజోష్ ను కొనసాగిస్తూ తన కెరియర్ లో ఎప్పుడూ చూడని విధంగా హ్యాట్రిక్ హిట్ ను అందుకోవడానికి అనీల్ రావిపూడి మూవీపై చాలఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న బాలకృష్ణ ఈమూవీ సెకండ్ షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడు.
 
 
వచ్చేనెల నుండి నెలరోజులు పాటు జరిగే ఈమూవీ సెకండ్ షెడ్యూల్ లో బాలకృష్ణ పక్కన నటించవలసిన హీరోయిన్ ఎంటర్ కావలసి ఉంది. వాస్తవానికి బాలయ్య పక్కన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తో అనీల్ రావిపూడి సంప్రదింపులు జరిపినప్పటికీ ఆమె డిమాండ్ చేసిన పారితోషికం చాలఎక్కువగా ఉండటంతో ఈసినిమాకు సంబంధించిన హీరోయిన్ అన్వేషణ క్లైమాక్స్ కు చేరుకున్నట్లు టాక్.
 
 
సోనాక్షి సిన్హా తో కుదరకపోవడంతో త్రిష హుమా ఖురేషి ల పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ ఆపేర్లు కూడ ఫైనల్ కాలేదు అంటున్నారు. ప్రియాంక జవలకర్ తో ఈమధ్య ఫోటో షూట్ చేసి అనీల్ రావిపూడి ప్రయత్నించినప్పటికీ ఆమె లుక్స్ బాలయ్య పక్కన సరిపోదు అన్న అంచనాలకు అనీల్ రావిపూడి వచ్చినట్లు టాక్. ఇలాంటి పరిస్థితుల మధ్య బాలయ్య పక్కన కాజల్ ను తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నచర్చలు కూడ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
 
 
ఇప్పటికే చిరంజీవి పక్కన రెండు సార్లు కాజల్ నటించిన ట్రాక్ రికార్డు ఉండటంతో ఆమె బాలయ్య పక్కన అన్నివిధాల సరిపోతుందని అనీల్ రావిపూడి ఒక ప్రాధమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం పండంటి బిడ్డకు జన్మను ఇచ్చిన తరువాత కాజల్ ఏమాత్రం సమయం వృధా చేయకుండా విపరీతమైన వ్యాయమం చేసి తన క్యూట్ లుక్ ను తిరిగి తెచ్చుకోగలిగింది. ఆమెకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీతో ఉన్న పరిచయాలతో తిరిగి ఆమె ఒక భారీ మూవీ ప్రాజెక్ట్ లో నటించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఈవిషయాలు అన్నీ పరిగణలోకి తీసుకుని అనీల్ రావిపూడి చేస్తున్న ప్రయత్నాలు సక్సస్ అయితే కాజల్ కు మళ్ళీ రీ ఎంట్రీ సక్సస్ అయినట్లే అనుకోవాలి..
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: