సాధారణంగా పౌరాణిక జానపద చారిత్రాత్మక సినిమాలలో నటించే నటీనటులకు ఆర్టిఫిషియల్ జ్యూయలరీ పెడుతూ ఉంటారు. అయితే సహజత్వం కోసం బంగారు కిరీటాన్ని పెట్టుకున్న సందర్భం ‘దానవీర సూరకర్ణ’ మూవీలో జరిగింది. ఈమూవీలో దుర్యోధనుడు పాత్రలో నటించిన ఎన్టీఆర్ సహజత్వం కోసం వజ్రాలు పొదిగిన కిరీటాన్ని అప్పట్లో పెట్టుకోవడం ఆరోజులలో ఒక సంచలనం.


దర్శకుడు గుణశేఖర్ ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ ను ప్రవేశ పెడుతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ఈమూవీలో శకుంతల పాత్రను పోషిస్తున్న సమంతకు అత్యంత విలువైన బంగారంతో చేసిన డిజైనింగ్ జ్యూయులరీని సమంత కోసం ప్రత్యేకంగా గుణశేఖర్ డిజైన్ చేయించాడట. అంతేకాదు ఈమూవీలో దుష్యంతుడి పాత్రకు సంబంధించి పాత్రను పోషిస్తున్న నటుడుకి కూడ పూర్తి బంగారంతో నగలు కిరీటాలు గుణశేఖర్ చేయించాడట. ఈవిషయాన్ని స్వయంగా గుణశేఖర్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియచేసాడు.


ప్రముఖ జ్యూయులరీ డిజైనర్ నీతూ లుల్లా సారధ్యంలో 15 కేజీల బంగారు ఆభరణాలు వసుంధరా జ్యూయులర్స్ లో తయారు చేయించారట. పూర్తి హ్యాండ్ మేడ్ జ్యూయులరీగా వీటిని తయారు చేయించడానికి 7 నెలల సమయం 14 కోట్ల ఖర్చు అయిందని గుణశేఖర్ చెపుతున్నాడు. సమంతకు అదేవిధంగా దుష్యంతుడు కు మేనక కు సంబంధించి వివిధరకాల నగలు ఈమూవీలో కనిపిస్తాయని గుణశేఖర్ అంటున్నాడు. 3డీ ఎఫెక్ట్ లో ఈమూవీ చూసే ప్రక్షకులకు ఒక అద్భుతమైన అనుభవం కలుగుతుందని గుణశేఖర్ అంచనాలు పెంచుతున్నాడు.


ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడ్డ ఈమూవీ ఎట్టకేలకు ఏప్రియల్ 14న పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్నది. సమంత మార్కెట్ ప్రస్తుతం చెప్పుకోతగ్గ స్థాయిలో లేకపోవడంతో ఈమూవీ బిజినెస్ చాల కష్ట సాధ్యంగా జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి. గుణశేఖర్ భారీ సినిమాలు తీస్తాడు కానీ ప్రస్తుత తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు తీయలేకపోతున్నాడు అన్న విమర్శలు కూడ ఉన్నాయి మరి ఈ విమర్శలకు గుణశేఖర్ ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: