జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ అందరికీ మించి ఈ షో ద్వారా స్టార్ హీరో రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా సుడిగాలి సుదీర్ పేరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే అతను కేవలం కమెడియన్ మాత్రమే కాదు మల్టీ టాలెంటెడ్ అన్న విషయం అందరికీ తెలుసు. తనలో ఉన్న ప్రతిభ ఏంటో అందరికీ నిరూపించి ఎన్నోసార్లు ఆశ్చర్యపరిచాడు. ఇక రష్మీతో లవ్ ట్రాక్ కారణంగా కూడా బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా అందరికంటే కాస్త తొందరగా కనెక్ట్ అయ్యాడు. ఇలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడంతో వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు సుడిగాలి సుదీర్. వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుడిగాలి సుదీర్ హీరోగా నటించిన గాలోడు సినిమా మంచి హిట్ అందుకుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఇప్పుడు మరో సినిమాకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో సుధీర్ సరసన దివ్యభారతి నటిస్తోంది. అయితే సుధీర్ కు సంబంధించి అటు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలాంటి పోస్టులు అతని పాపులారిటీ పెరగడానికి కారణం అయ్యాయి అని చెప్పాలి.


 కాగా జబర్దస్త్ కమెడియన్ టాలీవుడ్ హీరో సుడిగాలి సుదీర్ కి ఇన్స్టాగ్రామ్ లో 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కానీ సుడిగాలి సుదీర్ మాత్రం కేవలం ఒకే ఒక్కరిని ఫాలో అవుతూ ఉండడం గమనార్హం. అయితే ఆ ఒక్కరు ఎవరో గెస్ట్ చేయండి అంటే.. తప్పకుండా రష్మీ అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ఆమె కాదు.. సుడిగాలి సుదీర్ ఫాలో అవుతున్న ఏకైక  వ్యక్తి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ ను స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు. అందుకే ఆయన ఇన్స్పిరేషన్ అయిన మెగాస్టార్ ఒక్కడినే ఫాలో అవుతున్నాడు సుధీర్.

మరింత సమాచారం తెలుసుకోండి: