ఋణాల పై మారిటోరియం గడువు ముగిసిపోయింది. తీసుకున్న లోన్స్ కు సంబంధించి విధిగా ఈనెల నుండి బ్యాంకులకు పేమెంట్స్ కట్టాలి ఇప్పటికే జీతాలలో కోతలతో వచ్చే జీతం చిక్కిపోవడంతో తీసుకున్న అప్పులు ముఖ్యంగా కార్ లోన్ పర్సనల్ లోన్ ఎడ్యుకేషనల్ లోన్ హోమ్ లోన్ ఇలా అనేక లోన్స్ పేమెంట్ లు ఎలా కట్టాలి అని మధ్యతరగతి ప్రజల గుండెలలో గుబులు పెరిగిపోతోంది.
దీనితో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వ్యాపారాలు ప్రజల కొనుగోళ శక్తి మరింత పడిపోవడంతో మరిన్ని సమస్యలలో పడిపోతాయి అన్నఅంచనాలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో సగం జీతాలతో పనిచేస్తున్న చాలామంది తాము కష్టపడి కొనుకున్న కార్లు ఇళ్ళకు సంబంధించి ఇఎమ్ఐ లు కట్టకపోతే వాటిని వదులుకోవలసిన పరిస్థితులతో పాటు అవి వేలానికి వస్తే తమ పరిస్థితి ఏమిటి అంటూ సగటు మనిషి బెంబేలు పడిపోతున్నాడు.
ప్రస్తుతం ఈకరోనా పరిస్థితులు వల్ల పర్యాటక రంగం విమానయాన రంగం ఆతిధ్య సేవల రంగం రియల్ ఎస్టేట్ సినిమా రంగాలలో పనిచేసే వారిలో కొన్ని వేలమందికి ఉద్యోగాలు పోవడంతో వీరందరూ ప్రస్తుతం తీసుకున్న వ్యక్తిగత ఋణాలు తీర్చకపోతే తమ పరిస్థితి ఏమిటి అంటూ అనేక బ్యాంకింగ్ ఉన్నత అధికారులు భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వీరంతా తీసుకున్న ఋణాలు నాన్ పెర్ఫార్మింగ్ ఋణాలుగా మారిపోతే ఈ ఆస్థులను వేలం వేస్తే కొనే వ్యక్తులు ఎక్కడ ఉన్నారు అని బ్యాంకింగ్ అధికారుల టెన్షన్.
ఇప్పటికే 50 శాతం పైగా వ్యాపారాలు దెబ్బ తినడంతో ఈ వ్యాపారాలు నిర్వహించే యజమానులు అంతా తమ దగ్గర పనిచేసే సిబ్బందిని చాల వరకు తీసివేసారు. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టకపోతే ఉద్యోగ రంగంతో పాటు వ్యాపార రంగం కూడ మరింత కుదేలు అయ్యే ఆస్కారం ఉంది. దీనితో ఈ సమస్యలకు పరిష్కారంగా కరోనా సమస్యలు చక్కపడే వరకు లోన్స్ తీసుకున్న వారి నుండి కేవలం వడ్డీ మాత్రమే కట్టించుకునే పద్ధతిని బ్యాంకులు అనుసరించకపోతే మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి మరింత అయోమయంలో పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి