ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఫిక్స్ డిపాజిట్ ల పై వడ్డీ రేట్లు పెంచి.. ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఇకపోతే నెలవారి జీతం తీసుకుంటున్న సగటు మనిషికి పొదుపు చేయాలి అంటే చాలా కష్టమైన పని. కానీ ప్రతి ఒక్కరూ పొదుపు చేయాలని ఆలోచిస్తారు కాబట్టి అప్పుడు వారికి వెంటనే గుర్తుకు వచ్చే ఆప్షన్ ఫిక్స్ డిపాజిట్. ఇక మన దేశంలోని వివిధ బ్యాంకులలో వివిధ రకాల వడ్డీ రేట్లు కూడా కలిగి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఫిక్స్ డిపాజిట్ యొక్క వడ్డీ రేటు పెట్టుబడి పెట్టిన అసలు మొత్తం అలాగే పెట్టుబడి కాల వ్యవధిపై నిర్ణయించబడుతుందని గుర్తించాలి.

ఇక ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  ప్రైవేట్ రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు తమ ఫిక్స్ డిపాజిట్ లో వడ్డీ రేట్లు పెంచాయి. ఇకపోతే ఎస్బిఐ అలాగే యాక్సిస్ బ్యాంకులు రెండూ కూడా రూ.2 కోట్ల లోపు ఫిక్స్ డిపాజిట్లు పై వడ్డీ రేట్లు పెంచి ఖాతాదారులకు ఆనందాన్ని కలిగించాయి. ఇకపోతే ఆర్బిఐ పెంచిన రెపోరేట్ కి  అనుగుణంగా స్టేట్ బ్యాంక్ కూడా ఎంపిక చేసిన టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 15 బేసిక్ పాయింట్లు పెంచింది. ఇక సవరించిన ఈ వడ్డీ రేట్లు ఆగస్టు 13 అనగా నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి ఇక ఫిక్స్ డిపాజిట్ ల వడ్డీరేట్ల గురించి తెలుసుకుంటే ..ఏడు రోజుల నుంచి 45 రోజుల ఫిక్స్ డిపాజిట్ ల పై రెండు కోట్లకు లోపల ఫిక్స్ డిపాజిట్ చేసిన ఖాతాలపై 2.90 నుండి వడ్డీ శాతం మొదలవుతుంది.

ఇక 46 రోజుల నుంచి 179 రోజుల ఫిక్స్ డిపాజిట్ లపై 3.9% ఉంటుంది. ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాలు ఫిక్స్ డిపాజిట్ చేసిన ఖాతాలపై 5.3 శాతం వడ్డీ నుండి 5.45 శాతానికి పెంచారు. ఇక రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల ఫిక్స్ డిపాజిట్ ల పై 5.5 శాతానికి పెంచగా..మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల ఫిక్స్ డిపాజిట్ లపై 5.60 శాతం వడ్డీ పెంచినట్లు సమాచారం. ఇక పది సంవత్సరాల లోపు అయితే 5.65% వడ్డీ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: