బీమా దారుడు ప్రమాదంలో గాయపడి .. కాళ్లు, చేతులు పోగొట్టుకున్నా సరే రూ. 10 లక్షల బీమా వర్తిస్తుంది. ఒకవేళ మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల బీమాను అందించనున్నారు. అలాగే రూ. 299కి కూడా ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నట్లుగా ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కూడా బాల సత్యనారాయణ కోరారు. ఇకపోతే రూ. 399 తో కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. ప్రమాదవశాస్తూ మరణించిన లేదా శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడినా.. పక్షవాతానికి గురైనా సరే రూ.10 లక్షలు చెల్లిస్తారు. ముఖ్యంగా ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరినప్పుడు ఇన్ పేషెంట్ కింద రూ.60 వేల వరకు చెల్లిస్తారు.
అంతేకాదు ఇద్దరూ పిల్లల చదువుల కోసం గరిష్టంగా రూ.1 లక్ష రూపాయలు విద్యా ప్రయోజనం కింద చెల్లిస్తారు. అంతేకాదు అవుట్ పేషెంట్ గా వెళితే ఒక రోజు మినహాయించి పది రోజుల వరకు రూ. 10, 000 చెల్లిస్తారు. ఒకవేళ బీమా దారుడు 150 కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైతే 25వేల రూపాయలను రవాణా కోసం, అదనంగా అంత్యక్రియల కోసం రూ.5 వేలు చొప్పున చెల్లిస్తారు. ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఈ బీమా పథకం ప్రతి ఒక్కరికి లాభదాయకమని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి