టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫైరింగ్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న హీరోయిన్ నిత్యామీనన్. నిత్యామీనన్ కి కథ చెప్పటం అంటే చిన్న విషయం కాదు. హీరోకి ఎంత జాగ్రత్తగా కథని చెబుతున్నామో…అంత కంటే జాగ్రత్తగా నిత్యామీనన్ కి కథని చెప్పాలి. ముఖ్యంగా వల్గారిటి ఉన్న రోల్స్ ని తను చేయనని అని ముందుగానే డైరెక్టర్ కి చెబుతుంది. దీంతో సగం టెన్షన్ దర్శకుడికి అక్కడే మొదలవుతుంది. ఈ మధ్య కాలంలో వస్తున్న కమర్షియల్ చిత్రాలు అన్నీ హీరోయిన్స్ ని కేవలం సాంగ్స్ కోసమే ఉపయోగిస్తున్నారు.


కానీ నిత్యామీనన్ విషయంలో మాత్రం అలా కాదు. తనని కచ్ఛితంగా సినిమాలో భాగంగానూ, కథలో భాగంగానూ చూపించాలి. తన పాత్రలు అలా ఉంటేనే నటిస్తాను అని తెగేసి చెప్పిద్ది. ఇటువంటి కఠినమైన నిర్ణయాల కారణంగా నిత్యామీనన్ ఇప్పటి వరకూ చాలా తక్కువ చిత్రాలను చేయాల్సి వచ్చింది. నిత్యామీనన్ కి గ్లామర్ పరంగా నటించటం అస్సలు ఇష్టం లేదు కాబట్టి, తను నటించిన చిత్రాలలో ఇటువంటి సన్నివేశాలు సైతం ఎక్కడా లేవు.


అయితే తాజాగా నిత్యామీనన్ గ్లామర్ ఓరియంటెడ్ చిత్రాలలలో నటించేందుకు రెడీ అని అంటున్నారట. దీంతో చాలా మంది డైరెక్టర్స్ నిత్యా వద్ద గ్లామర్ ఓరియంటెడ్ కథలని తీసుకువెళుతున్నారు. ఎవరు కథ చెప్పినా నిత్యామీనన్ చేత వారు పొట్టి డ్రెస్ లను వేయించేందుకే ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక గ్లామర్ అంటే ఆ మాత్రం పొట్టి డ్రెస్ లను వేసుకోక తప్పదు మరి.


కానీ ఈ విషయంలో మరోసారి నిర్ణయం తీసుకోవాలని నిత్యామీనన్ భావిస్తుందట. ప్రస్తుతం తన ముందుకు వచ్చిన గ్లామర్ ఓరియంటెడ్ రోల్స్ లో నటిస్తే…ఇక తనకు ఆ ముద్ర పడిపోతుందేమో అని భావిస్తుంది. అలా ముద్ర పడిపోకుండా ఉండేందుకు గ్లామర్ డోస్ తక్కువ ఉన్న పాత్రలను సెలక్ట్ చేసుకుంటేనే మంచిదని భావిస్తుందట.



మరింత సమాచారం తెలుసుకోండి: