సోషల్ మీడియా లో కానీ సాధారణంగా బయట కానీ జనాలతో ఎక్కువగా మమేకం అవ్వడం రవితేజ పెద్దగా కనపడదు. తన కెరీర్ ఎదో తాను చూసుకోవడం , తన పని లో బిజీ ఉండడమే రవి కి ఇష్టమైన విషయం కానీ వేరే విషయాల గురించి పట్టించుకోడు. మనసులో ఏదన్నా ఉన్నా తన కుటుంబం తో పంచుకుంటాడు కానీ ఫాన్స్ దగ్గర మాట్లాడ్డం సోషల్ మీడియా లో హల్చల్ ఏదీ కనపడదు మనోడి దగ్గర అలాంటిది రవితేజ కూడా ఈ మధ్యన ఇంటర్నెట్ లో తెగ కనిపిస్తున్నాడు.


సోషల్ మీడియా లో యాక్టివ్ అవుతున్నాడు. ట్విట్టర్ లో తనదైన శైలి లో చాటింగ్ చేస్తూ సమాధానాలు చెబుతూ కనిపిస్తున్నాడు. ఈ మధ్య మీడియా ఇంటర్వ్యూ లు కూడా బాగా పెంచిన రవి అసలు పిల్లలని ఎలా పెంచాలి అనే దాని గురించి మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా తన మనసులో భావాలు పంచుకున్నాడు ..


" చిన్నప్పటి నుంచీ పిల్లలని సరిగ్గా పెంచాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రస్తుతం ఉన్న ప్రపంచం ఎలా ఉంది అనేది వారికి పూర్తిగా అవగాహన అయ్యేలా చెప్పాలి. అందరినీ సమానంగా చూడడం కూడా నేర్పించాలి. మగపిల్లలు ఆడ పిల్లలనీ ఆడ పిల్లలు మగ పిల్లలనీ సమానంగా చూసే విధంగా చిన్నతనం నుంచే నేర్పించి తీరాలి.


అప్పుడే వారు రేపటి పౌరులుగా సరైన దారిలో వెళతారు'' అంటూ చెప్పుకొచ్చాడు మాస్ రాజా. ఇంట్లో సరిగ్గా పెంచితేనే బయట వారు పర్ఫెక్ట్ గా ప్రవర్తిస్తారు. " నా కూతురు నీ కొడుకునీ నేను సమానంగా చూస్తాను. అన్నింటా ఇద్దరికీ ఈక్వల్ షేర్ " అంటున్నాడు మాస్ మహారాజ్.


మరింత సమాచారం తెలుసుకోండి: