Image result for shaoo updates
ఐదేళ్ళ కఠోర శ్రమ తరవాత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "బాహుబలి" రెండు బాగాల సినిమా దేశంలో అనేక సంచలనాలు, రికార్డులు సృష్టించింది. ఈ సినిమా ఇంత భారీ విజయం వెనుక హీరో ప్రభాస్ కష్టం చాలానే ఉంది. కనీసం ఈ సినిమా కోసం తన ఐదేళ్ల కెరీర్ ని ధారపోశాడు హీరో ప్రభాస్. అంతేకాకుండా తన బాడీషేప్ మార్చు కోవడానికి చాలా కసరత్తులు చేసి శరీరాన్ని తీవ్రంగా కష్టపెట్టి సినిమాలో అద్భుతంగా కనిపించాడు. ఈ విషయం డైరెక్టర్ రాజమౌళి చాలాసార్లు చెప్పాడు. ప్రభాస్ భుజం దెబ్బ తిని శస్త్ర చికిత్స చేయించు కోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.

Image result for sahoo updates

ఈ సందర్భంగా బాహుబలి వంటి భారీవిజయం తర్వాత చేస్తున్న సినిమా తొందరగా అవ్వగొట్టాలని కాక ఖచ్చితంగా హిట్టు కొట్టాలని భారీ బడ్జెట్ తో కూడుకున్న "సాహో" సినిమా చేయడానికి సిద్దమైపోయాడు ప్రభాస్. ఈ సినిమా మొదలై దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా సగం కూడా పూర్తి కాలేదు. ప్రస్తుతం "సాహో" సినిమా షూటింగ్ దుబాయ్ లో మండుటెండల మధ్య 70రోజులపాటు నిర్విరామంగా షూటింగ్ చేయడానికి రెడీఅవుతున్నారు. ఇంకో మూడురోజుల్లో ఆ షెడ్యూల్ మొదలవు తుంది. 

Related image

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో మీద అంచనాలు మామూలుగా లేవు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కీలకమైన దుబాయ్ షెడ్యూల్ కోసం ప్లానింగులో ఉంది. సుమారు 150 కోట్ల బడ్జెట్ తో ఇది రూపొందుతోందన్న వార్త తెలిసినప్పటినుండి జాతీయ మీడియాను సైతం ఆకర్షించింది. కేవలం ఒకే ఒక్క సినిమా "రన్ రాజా రన్" తో మాత్రమే అనుభవమున్న  దర్శకుడు సుజిత్ ని నమ్మి ప్రభాస్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి ఓకే చెప్పడం చూస్తే ఆ సినిమా మెటీరియల్ ఎంత బలంగా ఉందో అనే విషయం అందరికి ఆశ్చర్యం కలుగుతోంది.
Related image
శ్రద్ధా కపూర్ "డుయల్-షేడ్స్" ఉన్న హీరొయిన్ పాత్ర పోషిస్తోందని ఇప్పటికే ఒక వార్త ప్రచారం లో ఉంది. ఇప్పుడు సాహో కి మరింత ఆకర్షణ జోడించేందుకు ఒక బ్రిటిష్ సుందరిని రంగం లోకి ప్రవేశ పెట్టబోతున్నారని తాజా సమాచారం.

Image result for sujith sahoo director

నిజానికి ఇదివరకే ఈ దుబాయ్ షెడ్యూల్ మొదలవ్వాలి. కానీ ఆ దేశంలో షూటింగుకి పర్మిషన్ రాక ఇంత ఆలస్యమైంది. దుబాయ్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీ కరించడానికి సిద్ధమవు తున్నారు  ‘సాహో’ సినిమా యూనిట్. యాక్షన్ సన్నివేశాలు కోసం ప్రభాస్ ఇప్పటికే నెల రోజుల నుంచి కష్టపడుతున్నాడు. ఎంతో శ్రమకోర్చి అవతారం మార్చుకున్నాడు. బాహుబలి వంటి సంచలన సినిమా తర్వాత విడుదలవుతున్న సినిమా కాబట్టి ‘సాహో’ కోసం చాలా తీవ్రంగా కష్టపడుతున్నాడు ప్రభాస్.

Image result for sujith sahoo director

కరణ్‌ జోహార్ తో ప్రభాస్ తో విభేదాలే "సాహో"  బాలీవుడ్ బిజినెస్ కాకపోవటానికి కారణమని తెలుస్తుంది.వారిమధ్య నెలకొన్న విభేదాల కు కారణంపై ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. "బాహుబలి" తర్వాత ప్రభాస్‌ తో కరణ్ ఓక సినిమా ప్లాన్ చేశా రట. ఆ సినిమాకు ప్రభాస్ కూడా మొదట సానుకూలంగా స్పందించారట. కానీ ప్రభాస్ 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేయటంతో కరణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడనేది బాలీవుడ్ పత్రికల కథనం.

Image result for karan johar prabhas

బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఏర్పడిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కరణ్ భారీ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశాడు.ప్రభాస్  డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ సల్మాన్ ఖాన్‌ కు మించి ఉందని, అంతేకాకుండా దక్షిణాదిలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా అంతగా డిమాండ్ చేయలేదనే వార్తలు మీడియాలో ప్రచారం అయ్యాయి. ప్రభాస్ అడిగే రెమ్యునరేషన్ సరి కాదు అని మాట వినిపించింది.ప్రభాస్ అధికంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో కరణ్ జోహర్ ఆ ప్రాజెక్ట్‌ను వాయిదా వేసుకొన్నాడు. 


దాంతో ప్రభాస్‌, కరణ్ మధ్య విభేదాలు నెలకొన్నాయి.ప్రభాస్‌తో ప్రాజెక్ట్-క్లోజ్ అయిందనే వార్తల నడుమ, కరణ్ జోహర్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. "డియర్ యాంబిషన్! నీవు ఏదైనా ఘనత సాధించాలంటే పేరున్న దిగ్గజాలతో పోల్చుకోవడం తగ్గించుకోవాలి" అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Image result for karan johar and prabhas tweets

మరింత సమాచారం తెలుసుకోండి: