దేవసేన పాత్రతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సెలెబ్రెటీగా మారిపోయిన అనుష్క పెళ్లి గురించి ఆమె కుటుంబ సభ్యుల కంటే మీడియా వర్గాలు విపరీతమైన ఆసక్తిని కనపరుస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రభాస్ అనుష్కల సాన్నిహిత్యం పై వార్తలు రాస్తున్న మీడియా వీరిద్దరూ పెళ్ళి చేసుకోవడం ఖాయం అంటూ ఇంకా ఊహాగానాలు కొనసాగిస్తూనే ఉంది. 
అనుష్క సైతం తేల్చి చెప్పింది
ఈ వార్తలను వీరిద్దరూ ఖండించినా పట్టించుకునే స్థితిలో ఎవరు లేరు. ఇది ఇలా ఉండగా అనుష్క తల్లి ప్రపుల్లా శెట్టి ఈమధ్య అనేక ఆలయాలలో అనుష్క కోసం పూజలు చేయిస్తూ ఒక ఆలయంలో తనకు ఎదురుపడ్డ మీడియా వర్గాలతో అనుష్క పెళ్లి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై ప్రపుల్లా శెట్టి స్పందింస్తూ వారిద్దరూ చాల సినిమాలలో కలిసి నటించారు కాబట్టి అలాంటి వార్తలు వచ్చి ఉంటాయని ఆమె అభిప్రాయపడింది. 
మరి ఎవరిని పెళ్లాడబోతున్నారు?
అయితే అనుష్కకు ప్రభాస్ లాంటి మిస్టర్ పర్‌ఫెక్ట్ భర్తగా దొరకాలని అన్వేషణ చేస్తున్నామని అలాంటి వ్యక్తి దొరకగానే వెంటనే అనుష్క పెళ్లి ఉంటుంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. దీనితో అనుష్కకు ప్రభాస్ లాంటి వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు అంటూ ఆమె నోటి వెంట ఆ కామెంట్స్ విన్న మీడియా వర్గాల మైండ్ బ్లాంక్ అయినట్లు సమాచారం. 
 అనుష్క పెళ్లి గురించి పూజలు
అనుష్కకు పెళ్లి సంబంధాలు చూస్తున్న విషయాన్ని ఆమె తల్లి కూడ ధృవీకరించడం ఇక్కడి ట్విస్ట్. ఇది ఇలా ఉండగా గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క రెండు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల స్క్రిప్ట్ కు ఓకె చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏమైనా ప్రభాస్ లాంటి వరుడు కోసం అనుష్క తల్లి చేస్తున్న అన్వేషణ ఎప్పటికి పూర్తి అవుతుందో ఆమెకే తెలియాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: