తెలుగు సినిమాల మార్కెటింగ్ స్ట్రాటజీ పూర్తిగా మారిపోయింది. బాహుబలి సినిమాతో ఈ విషయం బాగా అర్థమవుతుంది. భారీ కాన్వాసుపై బహుభాషా నటుల్ని ఎంపిక చేసుకుని మల్టీ స్టారర్లు తీసి మార్కెట్ పెంచుకుంటున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమాకి రాజమౌళి మార్కెట్ పెంచుకునే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమాని తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళికి హిందీ లో మంచి పాపులారిటీ వచ్చింది.
దానికి జతగా ఇంకా పాపులారిటీని పెంచే క్రమంలో ఉన్నాడు. అందుకోసం బాహుబలి జంట ప్రభాస్-అనుష్క జోడీని అతిధి పాత్రలో ఆహ్వానిస్తున్నాడట.బాహుబలి స్టార్స్ గా ఈ జంటకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
అలాగే ప్రభాస్ కి జపాన్ సహా పలు దేశాల్లో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆ విధంగా కూడా చాలా ప్లస్ అవుతుంది. ఇక వాళ్ళు నటిస్తున్నారా? లేదా అనేది ఇంకా నిర్దారణ కాలేదు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.