న్యాచురల్ స్టార్ నాని మంచి జోరు మీద ఉన్నాడు. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ 'జెర్సీ' సినిమా తో ప్రేక్షకులను అలరించాడు నాని. ఇదే క్రమంలో 'గ్యాంగ్ లీడర్' సినిమాని కూడా ఈ నెలాఖరున విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా పై చాలా శ్రద్ధ తీసుకొని ఎలాగైనా ఈ ఏడాది రెండో హిట్టు కొట్టాలని ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో చాలా వెరైటీగా నాని ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.


ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ టైటిల్ పై మెగా ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత రావడంతో మెగా ఫ్యాన్స్ ని కూడా ఒప్పించడానికి నాని చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు...ఇందుమూలంగా నే ‘గ్యాంగ్ లీడర్’ సినిమా విషయంలో నాని సైలెంట్ గా ఉన్నట్లు..ప్రమోషన్ కార్యక్రమంలో ఓ వెరైటీ ఈవెంట్ తో.. మెగా అభిమానులను అలరించనున్నట్లు సమాచారం.


ఇదిలా ఉండగా ఇటీవలే నాని ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చూసి దర్శకుడు స్వరూప్ ని ప్రత్యేకంగా పిలిచి ఏదైనా లైన్ ఉంటే సిద్ధం చేసుకుని కలవమని చెప్పాడట. దీంతో ఎగ్జైట్ ఆయిన సదరు డైరెక్టర్ వెంటనే ఆ పనిలో ఉన్నట్టు సమాచారం. అయితే స్టోరీ విషయంలో కచ్చితంగా కన్ఫామ్ అయితేనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని డైరెక్టర్ కి నాని సూచించడం జరిగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: