సినిమా ప్రపంచంలోకి ఒక్కసారి అడుగు పెడితే స్వర్గంలోకి అడుగు పెట్టినట్టే అని భావిస్తారు ఎంతో మంది ఔత్సాహిక కళాకారు. అయితే సినిమాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అన్నీ అనుకున్నట్టుగా సాగకపోతే మనసు వికలం చేసుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డవారు ఎంతో మంది ఉన్నారు.  అన్ని సినీ పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.  అయితే సినిమాల్లో అవకాశం కోసం ఎదురు చూసి నిరుత్సాహంతో ఆత్మహత్యలు చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. 

తాజాగా ముంబాయికి చెందిన ఓ వర్థమాన నటీమణి ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచింది.  ముంబైలోని  ఒషివారా ప్రాంతంలో గతరాత్రి చోటుచేసుకుందీ ఘటన. మృతురాలిని ఇరవై ఏళ్ల పెరల్ పంజాబీగా గుర్తించారు. ఓ కమర్షియల్ యాడ్ ద్వారా పెరల్ పంజాబీ గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో కాలం నుంచి సినిమాల్లో అవకాశాల కోసం పెరల్ ఎదురు చూస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోయింది. చివరిసారిగా విడుదలైన సినిమా అనుకున్న మేర హిట్ కాలేదు.

సినిమాల్లో నటించే అవకాశం కోసం చాలా కాలం నిరీక్షించినప్పటికీ అదృష్టం వరించకపోవడంతో... ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్టు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెరల్ అపార్ట్ మెంట్ వాచ్ మెన్ మాట్లాడుతూ.. రాత్రి 12:15 నుంచి 12:30 మధ్య ఈ సంఘటన జరిగింది. కేకలు వినబడుతుంటే ఎవరో రోడ్డుమీద అరుస్తున్నారని అనుకున్నాను. కానీ ఆమె ఉంటున్న మూడో అంతస్తు నుంచి అరుపులు వినిపించాయి... ఏం జరిగిందో చూద్దామని వెళ్లే సరికి అక్కడేం కనిపించలేదు.

కాసేపటి తర్వాత థర్డ్ ఫ్లోర్ నుంచి పడి నటి ఆత్మహత్య చేసుకుంది.  కాగా, మానసికంగా కలతచెందిన పెరల్ తరచూ తన తల్లితో గొడవపడేదని ప్రాధమిక విచారణలో తేలింది.  గతంలో కూడా రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందనీ.. అయితే తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుందని పోలీసులు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: