టాలీవుడ్ లో గత దశాబ్ద కాలం నుంచి ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. బ్లాక్ మనీ వివాదం  సహా... టాలీవుడ్  సెలబ్రిటీలు  అందరూ డ్రగ్స్ కేసు నోటీసులు అందుకోవటం  టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేగింది . టాలీవుడ్ కు చెందిన స్టార్ యాక్టర్స్ చాలా మంది డ్రగ్  కేసులో ఇరుక్కోవడం ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంచలనంగా మారింది . 2017 సంవత్సరంలో తెరమీదకి వచ్చిన  ఈ డ్రగ్ కేసు   సృష్టించిన దుమారం అంతా ఇంతా కాదు. టాలీవుడ్ సెలబ్రిటీలు అందరికీ ముచ్చెమటలు పట్టించింది. ఇలాంటి వివాదాలు టాలీవుడ్ లో ఒక దశాబ్ద కాలంగా ఎన్నో చోటు చేసుకున్నాయి. ఓవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొట్లాటలతో  కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అల్లాడి పోయిందనే చెప్పాలి. 

 

 

 

 మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న.. శివాజీ రాజా ఉపాధ్యక్షుడిగా ఉన్న నరేష్ ఇలా రెండు వర్గాలు ఏర్పడ్డాయి.దీంతో మూవీ ఆర్టిస్ట్  అసోసియేషన్ లో ఎన్నో వివాదాలు చెలరేగాయి. అధ్యక్షుడు శివాజీ రాజా అనుమతి లేకుండానే ఉపాధ్యక్షుడు నరేష్  బాడీ మీటింగ్ నిర్వహించడం సహా  మరిన్ని సమావేశాలు నిర్వహించడం తో ఒక్కసారిగా అసోసియేషన్ వివాదాలతో అట్టుడికిపోయింది. అంతేకాకుండా అగ్రశ్రేణి వ్యభిచారం కూడా టాలీవుడ్ లో దుమారం రేపిందనే  చెప్పాలి. అగ్రశ్రేణి వ్యభిచారం టాలీవుడ్లో సెన్సేషనల్ గా మారిపోయింది. 

 

 

 

 శింగనమల మాఫియా,  బ్లాక్ మని,  స్టార్స్  డ్రగ్స్ కేసు, అగ్రశ్రేణి  వ్యభిచారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోట్లతో టాలీవుడ్  గత దశాబ్దకాలంగా అల్లాడిందనే  చెప్పాలి. దశాబ్ద కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సంచలన వివాదాలు.. ఎన్నో  ఘటన లు  దుమారం రేపాయి. ముఖ్యంగా స్టార్స్ డ్రగ్ కేసుతో  టాలీవుడ్ లో ఎక్కువగా దుమారం  రేగింది.మొత్తంగా డ్రగ్  కేసులో 15 మంది సెలబ్రిటీలు సీట్ నుంచి నోటీసులు అందుకున్నారు. ఈ సెలబ్రిటీల లో 12 మంది స్టార్ సెలబ్రెటీలు కేసులో ఇన్వాల్వ్ అయ్యి  ఉండడం సంచలనం రేపింది. ఇక టాలీవుడ్ బడా సెలబ్రిటీస్ అందరినీ ప్రత్యేక దర్యాప్తు బృందం డ్రగ్స్ కేసులో విచారణకు పిలవడం సహా.. సెలబ్రిటీల అందరూ చేసిన వ్యాఖ్యలతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా అట్టుడికిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: