లాక్ డౌన్ తో సెలెబ్రెటీలు అందరు తమ ఇళ్లకే పరిమితం అయిపోవడంతో వారి గత స్మృతులు బయటపడటం ఎక్కువైపోయింది. మీడియాకు కూడ సినిమాలకు సంబంధించి కొత్తవిషయాలను ప్రసారం చేసే అవకాశం లేకపోవడంతో సెలెబ్రెటీలను ఆన్ లైన్ లో ఇంటర్వ్యూలు చేస్తూ వారిని తమ గతంలోకి తీసుకువెళ్ళి అనేక ఆసక్తికర విషయాలు రాబడుతున్నారు. 


లాక్ డౌన్ ప్రారంభం అయ్యాక మీడియాకు అదేవిధంగా సోషల్ మీడియాకు విపరీతంగా అందుబాటులోకి వస్తున్న చిరంజీవి అనేక విషయాలను షేర్ చేస్తూ తెగసందడి చేస్తున్నాడు. ఈపరిస్థితులలో గతంలో చిరంజీవికి ఏర్పడిన బాధకు సుహాసిని పరిష్కారం చూపించిన ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 


వివరాలలోకి వెళితే 1986లో విడుదలైన ‘స్వాతిముత్యం’ మూవీ ఆరోజులలో ఒక ట్రెండ్ సెటర్. ఆమూవీలోని కమల్ హాసన్ అద్భుతమైన నటన ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుంది. అప్పట్లో సూపర్ హిట్ అయిన ఆమూవీని చిరంజీవి చూసి విపరీతంగా బాధ పడ్డాడట. దీనికి కారణం అలాంటి అద్భుతమైన పాత్ర తనకు ఎందుకు రాలేదు అన్నబాధ అప్పట్లో చిరంజీవికి ఉండేదట. ఈబాధతో చిరంజీవి తన సినిమాలను చేస్తూనే ఒక సినిమాకు సంబంధించి సుహాసినితో కలిసి నటిస్తున్నప్పుడు షూటింగ్ స్పాట్ లో సుహాసినికి చిరంజీవి చాల డల్ గా కనిపించాడట.


దీనితో ఎలర్ట్ అయిన సుహాసిని చిరంజీవిని ఏమైంది అంటూ అనేకసార్లు అడిగినప్పుడు తాను ‘స్వాతిముత్యం’ చూశానని కమల్ హాసన్ లాంటి అద్భుతమైన పాత్ర తనకెందుకు రాలేదు అని ఒకవిధంగా బాధ పడుతున్నాను అంటూ తన వ్యధను సుహాసినితో చెప్పుకున్నాడట. ఆతరువాత కొన్ని రోజులకు సుహాసినికి విశ్వనాథ్ ఒక సందర్భంలో ఎదురు పడినప్పుడు చిరంజీవితో ‘స్వాతిముత్యం’ లాంటి మంచి సినిమాలు ఎందుకుతీయరు అంటూ సుహాసిని విశ్వనాథ్ ను అడిగిందట. ఆతరువాత విశ్వనాథ్ చిరంజీవి అభిప్రాయం గ్రహించి ‘స్వయంకృషి’ మూవీలో చిరంజీవికి అద్భుతమైన పాత్రను క్రియేట్ చేయడం ఆసినిమాకు అనేక అవార్డులతో పాటు ప్రశంసలు కూడ వచ్చిన విషయాన్ని చిరంజీవి గుర్తుకు చేసుకున్నాడు. దీనితో ఒకవిధంగా ‘స్వయంకృషి’ మూవీలో చిరంజీవి పాత్రకు ఒక విధంగా సుహాసిని చేసిన రాయబారాలు మెగా స్టార్ కు కలిసి వచ్చాయి అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: