ఫిదా బ్యూటి సాయి పల్లవి నటిస్తున తాజా చిత్రం లవ్ స్టోరీ. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా దాదాపు కంప్లీటవచ్చింది. శేఖర్ కమ్ముల సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీటవుతుంది. ఇక లవ్ స్టోరీస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన అక్కినేని హీరో నాగ చైతన్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టైటిల్ పోస్టర్, టీజర్ చూస్తుంటే పక్కా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది.

 

IHG

అంతేకాదు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న టాక్ ఇప్పటికే వచ్చేసింది. లవ్ స్టోరీ లో సాయి పల్లవి నాగ చైతన్య ల క్యారెక్టర్ సినిమాకి పెద్ద అసెట్ అని చెప్పుకుంటున్నారు. ఇక ఫిదా తర్వాత మళ్ళీ సాయి పల్లవి కి తెలుగులో హిట్ దక్కలేదు. నానితో ఎంసిఏ, శర్వానంద్ తో పడి పడి లేచెమనసు, రణ రంగం సినిమాలు చేసినప్పటికి ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా సందడి చేయలేకపోయాయి.

 

IHG's Look from Virata Parvam: Classy yet Powerful

అయినా సాయి పల్లవి మాత్రం కూల్ గా తనకి నచ్చిన సినిమాలకి ఓకే చెప్పుకుంటూ వెళుతోంది. అందులో భాగంగానే లవ్ స్టోరీ, అలాగే రానా తో విరాట పర్వం సినిమాలు చేస్తోంది. అయితే ఇవి రెండు ఒకదానికి ఒకటి సంబంధం లేని సినిమాలు. రెండు కూడా పూర్తిగా భిన్నమైన జోనర్స్ లో తెరకెక్కుతున్నాయి. చెప్పాలంటే సాయి పల్లవి లవ్ స్టోరీ తో సంబంధం లేకుండా విరాట పర్వం సినిమా చేస్తుంది.

 

IHG Birthday wishes

ఈ రెండిటిలో సాయి పల్లవి పాత్రలు చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా విరాట పర్వం లో కంప్లీట్ డీ గ్లామర్ రోల్ లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు సాయికి పల్లవి సక్సస్ ఇస్తాయన్న నమ్మకంతో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: