ఈ మధ్య కాలంలో నీ కన్ను నీలి సముద్రం.. అనే పాట ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పనవసరం లేదు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఆ పాట యు ట్యూబ్ లో బాగా హిట్ అయ్యింది. ఇక ఆ పాటలో మెయిన్ గా ఆకర్షించింది హీరోయిన్ కీర్తి శెట్టి. ఇక ఈ ఉప్పెన హీరోయిన్ కీర్తి శెట్టి జోరు పెంచింది, తొలి సినిమా విడుదల కాకముందే ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా నాచురల్ స్టార్ నాని సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇక పూర్తి వివరాలకు ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చూడండి..

ఇక టాలీవుడ్ లో తన తొలి సినిమా విడుదల కాకముందే భారీ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ కీర్తి శెట్టి. ‘ఉప్పెన’తో మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్ముడు టీజర్, ట్రైలర్స్, రెండు వీడియో సాంగ్స్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుని బాగా ఫేమస్ అయిపోయింది. ఈ అమ్మాయి స్క్రీన్ పేరు అద్వైత. అదే పేరుతో కొన్ని తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో మాత్రం కీర్తి శెట్టి పేరుతోనే పరిచయం అవుతోంది.

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంతో ‘ఉప్పెన’ సినిమా విడుదల ఆగిపోయినప్పటికీ కీర్తి శెట్టికి మాత్రం అవకాశాలు తలుపు తడుతున్నాయి. తమ సినిమాల్లో నటించాలంటూ దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చిన అన్ని ఛాన్స్‌లకు ఓకే చెప్పేయకుండా కీర్తి శెట్టి జాగ్రత్తలు తీసుకుంటోందట. ఈ కోవలోనే ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్, నాని కాంబినేషన్లో తెరకెక్కబోయే ‘శ్యామ్ సింగరాయ్‌’ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందట.

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఫస్ట్ పార్ట్‌లో ఒకరు, సెకండ్ పార్ట్‌లో ఒకరు, క్లైమక్స్‌లో మరో హీరోయిన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో సాయిపల్లవిని ఓకే చేయగా.. ఇప్పుడు కీర్తి శెట్టి చేరింది. ఈ సినిమా నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తాము తీయబోయే మరో సినిమాకు కూడా కీర్తి శెట్టిని బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి మొదటి సినిమా రిలీజ్ కాకముందే అవకాశాలు క్యూ కట్టడంతో ఈ క్యూట్ హీరోయిన్ తెగ మురిసిపోతుందట.ఇక నాని రీసెంట్ గా వి సినిమాలో నటించాడు. ఆ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది కాని అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: