బిగ్ బాస్ సీజన్ త్రీ, ఫోర్ లకు నాగార్జున హోస్ట్ చేయడమే అతి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మరీ ముఖ్యంగా సీజన్ ఫోర్ చప్పగా మొదలై ఇపుడిపుడే పట్టాలు ఎక్కింది. దానికి కారణం కంటెస్టెంట్లు అంతా కొత్తవారు, దాదాపు జనాలకు తెలియని వారు కావడమే. ఇక నాగార్జున వీకెండ్స్ లో వచ్చి చేసే సందడి హంగామా కోసం ఆడియన్స్ కళ్ళు వేయింతలు చేసుకుని ఎదురుచూస్తారు. నాగ్ కూడా తనదైన స్టైల్ లో రక్తి కట్టిస్తున్నారు. కంటెస్టెంట్లకు సుతిమెత్తగా క్లాస్ తీసుకోవడమే కాకుండా వారితో గేమ్స్  ఆడిస్తూ జోక్స్ కట్ చేస్తూ వారికి కొత్త లవ్ ట్రాకులు తగిలిస్తూ ఇలా నాగ్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

దాంతో బిగ్ బాస్ సీజన్ ఫోర్ కి వీకెండ్స్ రేటింగ్ అదిరిపోయే రేంజిలో వస్తుంది. మిగిలిన అయిదు రోజులు మాత్రం రేటింగ్ దారుణంగా డ్రాప్ అవుతోందిట. అయినా సరే వీకెండ్స్ తో దాన్ని సర్దుబాటు చేసుకుంటూ ఎలాగోలా  నెట్టుకువస్తున్నారు. అయితే వైల్డ్ డాగ్ సినిమా  షూటింగ్ కోసం నాగ్ ఏకంగా మూడు వారాలు లాంగ్ లీవ్ పెట్టేసి బిగ్ బాస్ కి  బిగ్ షాక్ ఇచ్చేశాడు. దాంతో వరసపెట్టి మూడు వీకెండ్స్ ఎలా నెట్టుకురావాలి అన్నదే బిగ్ బాస్ కి బిగ్ ట్రబుల్ గా మరిందని అంటున్నారు.

ఇక్కడ నాగ్ ప్లేస్ లో ఎవరు హోస్ట్ గా వచ్చినా ఆ కిక్కు ఉండదని ఆడియన్స్ అంటున్నారు. ఓ విధంగా బిగ్ బాస్ హోస్ట్ గా నాగ్ బుల్లి తెర ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయారు. దాంతో నాగ్ లేని వీకెండ్ షోలను చూడలేమని కూడా అంటున్నారు. ఇది ఒక విధంగా రేటింగుల మీద తీవ్ర ప్రభావమే చూపనుందని అంటున్నారు. అసలే సీజన్ ఫోర్ మీద పెద్దగా హోప్స్ లేవు. నాగ్ కూడా సరైన టైం చూసి డుమ్మా కొట్టారు, ఇపుడు బిగ్ బాస్ ని ఆదుకునేది ఎవరు అన్నదే పెద్ద ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: