మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో చేస్తున్న సంగతి తెలిసిందే..సైరా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నాడు.. ఎన్నో అంచనాల మధ్య నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ కాగా, సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది ఆ మోషన్ పోస్టర్.. కొరటాల శివ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమ్ కమర్షియల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.. తొలిసారి కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ ని కాదని మణిశర్మ తో ఈ సినిమా చేస్తున్నాడు.కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది..

కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్ - నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ తేజ్  కూడా ఓ ముఖ్యమైన పాత్రలో చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఇందులో చరణ్ జోడిగా ఎవరు హీరోయిన్ గా చేస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.. కొరటాల శివ తనదైన శైలిలో సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులు జోడించి రూపొందిస్తున్న ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజాహెగ్డే కోసం మంచి రోల్ క్రియేట్ చేసాడట. పూజా ఇంతకముందు చేయని పాత్ర అని.. అది కూడా ఓ విలేజ్ గర్ల్ క్యారక్టర్ అని అంటున్నారు.

ఇకపోతే వరుసగా కథల్ని దర్శకుల్ని ఫైనల్ చేసేసి చక్కని ప్రణాళిక తన కెరీర్ స్పీడ్ కి ఎంతగా ఉపకరిస్తుందో చిరు చెప్పకనే చెప్పారు.కొరటాల - మోహన్ రాజా తర్వాత మెహర్ రమేష్- బాబి లాంటి దర్శకులకు అవకాశాలిచ్చారు చిరు. ఇంతకుముందే తనతో పని చేసే నలుగురు దర్శకులను పరిచయం చేశారు. దర్శకుడు బాబీతో రీమేక్ కాకుండా ఒక స్ట్రెయిట్ సినిమాని ఖాయం చేసుకున్నారు. ఉప్పెన ప్రీఈవెంట్లోనూ మెగాస్టార్ దీనిని కన్ఫామ్ చేశారు. దీంతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మరోసారి అధికారికంగా తమ ట్విట్టర్ లో చిరు-బాబి మూవీని ఎంతో ఆనందంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: