సూర్య , అనుష్క జంటగా నటించిన 'సింగం' విజయవంతమవడంతో, దాని సీక్వెల్‌ను కూడా తెరకెక్కించి మరో విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు హరి. 'పూజై' చిత్రం తర్వాత ఆయన 'సింగం-3'కు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి స్క్రిప్టును తయారు చేయడానికి తన బృందంతో సహా రెండు నెలలుగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుట్రాలంలో మకాం వేశారు.

ప్రస్తుతం స్క్రిప్టు పూర్తి చేసుకుంది. దీంతో జూన్‌లో ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించడానికి హరి సన్నాహాలు చేస్తున్నారు. ఈలోపు నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనుల్లో ఆయన నిమగమయ్యారు. 'సింగం', 'సింగం-2'కు భిన్నంగా 'సింగం-3'లో సూర్యను వైవిధ్యంగా చూపించనున్నట్లు సమాచారం.

అయితే సింగం 3లో అనుష్కకి చోటు దక్కే ఛాన్స్ కనిపించడంలేదు. మొదట అనుష్కని తీసుకునేందుకు హరి ఆసక్తి చూపినప్పటికీ, హీరో మాత్రం అనుష్కని తీసుకోవద్దని చెప్పుకొచ్చాడంట.

ప్రస్తుతం సూర్య 'హైకూ చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత వినోద్‌ దర్శకత్వలోనూ సూర్య నటించనున్నట్లు సమా చారం. ఈ చిత్రాలను పూర్తి చేసుకున్న తర్వాతే 'సింగం-3'లో సూర్య నటించునున్నారని కోలీవుడ్‌ సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: