
సినిమాలో నటించే హీరోయిన్లు, అవకాశం ఉన్నంతసేపు వారి నటనకు ప్రేక్షకులు విలువ ఇస్తూనే ఉంటారు. ఒక్కసారిగా వారికి అవకాశాలు తగ్గగానే వారి జీవితం అయోమయంగా మారుతుంది. అందుకే కొందరు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా తమకు కావలసినవన్నీ సమకూర్చుకుంటారు. ముఖ్యంగా నటీమణులు డబ్బుతో పాటు మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు.
అయితే సినీ ఇండస్ట్రీలో కొందరు తక్కువ వయసులోనే సినిమాలు చేస్తూనే, పెళ్లి చేసుకున్న వారు కొందరు ఉన్నారు. అయితే వారు ఇంకా సినిమాలో నటిస్తుండగా, ఇంకొందరు కుటుంబానికి పరిమితమయ్యారు..వారెవరు ఇప్పుడు చూద్దాం.
1).తెలుగులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన దివ్యభారతి 18 ఏళ్లకే బాలీవుడ్ నిర్మాత సాజిద్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఆమె ప్రమాదవశాత్తు మరణించింది.
2).ఇక మన సినీ ఇండస్ట్రీలో రెడీ ,హ్యాపీ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించిన జెనీలియా ఢీ సినిమా తో నవ్వులు పూయించింది. ఆమె తెలుగులో స్టార్ హీరోలతో చేసి మెప్పించింది. ఆమె 24 ఏళ్లు వయసులోనే పెళ్లి చేసుకుంటుందట. తన భర్త మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొడుకు బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ను పెళ్లి చేసుకుంది.
3).తమిళ స్టార్ నటి శాలిని హీరో అజిత్ ను తన 21 ఏళ్లకే ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా జూనియర్ శ్రీదేవి కూడా రాహుల్ అనే వ్యక్తిని 23 ఏళ్ళ వయసు ఉండగానే కానీ వివాహం చేసుకుంది.
4).ఇక బాలీవుడ్ నటి మల్లికా శరావత్ 23 ఏళ్లకు, రాధిక ఆప్టే 20 ఏళ్లకు ఇంటివారయ్యారు. ఇక సీనియర్ నటి డింపుల్ కపాడియా పదహారేళ్లకే తాళి కట్టించుకున్నారు.
5)సౌత్ హీరోయిన్ గా కొనసాగుతున్న రాధిక 22 ఏళ్లకే ప్రతాప్ అనే వ్యక్తితో తాళి కట్టించుకోగా, కోలీవుడ్ భామ అమలాపాల్ దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇక వీరందరూ కూడా అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని ఒక ఇంటివారయ్యారు. ప్రస్తుతం వీరిలో కొందరు సినిమాలో నటిస్తుండగా మరికొంతమంది ఇంటిపట్టునే వుంటూ ఇంటి బాధ్యతలు స్వీకరించారు.