సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇందులో నందమూరి బాలకృష్ణ ఒకరు. సినిమాలలో వైలెన్స్ కు మారు పేరు బాలకృష్ణ. ఇక సినీ ఇండస్ట్రీలో కూడ మాస్ ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఏదో ఒక సెంటిమెంటు అలాగే మాస్ తో  ప్రేక్షకులను ఆనందపరుస్తుంటారు. మరికొన్నిసార్లు భయానికి లోనవుతారు. సాధారణంగా సెంటిమెంట్ లోనే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు అనుకోండి.. కానీ భయపెట్టే సెంటిమెంట్లను మాత్రం ఎవరూ మర్చిపోలేరు.. ఇంతకూ ఈ సెంటిమెంటు గోలేంటి అని అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా.. ఇలాంటి సెంటిమెంట్ గోల నందమూరి బాలకృష్ణ అభిమానులకు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

ఇక విషయానికి వస్తే, బాలకృష్ణ తో బోయపాటి శీను తెరకెక్కిస్తున్న చిత్రం'అఖండ'. అయితే  " అ"  అన్న అక్షరంతో మొదలయ్యే టైటిల్ ను నిర్ణయించారు. ఈ సినిమా విజయం సాధించాలన్న అభిలాషతో అలా  నామకరణం చేసి ఉండవచ్చు. కానీ"అ "అనే అక్షరంతో ఆరంభమయ్యే టైటిల్స్ ఉంటే బాలయ్య కు అంతగా చేరవని ఓ సెంటిమెంట్ ఉందని, ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రాల్లో ఒక్క'అనసూయమ్మగారి అల్లుడు' మినహాయిస్తే, ఆ తో ఆరంభమైన చిత్రాలు అంతగా అలరించలేకపోయయి. ఈ విషయమై బాలయ్య అభిమానులకు ఆందోళన కలిగిస్తున్న విషయం.

బాలకృష్ణ హీరోగా పరిచయం కాక ముందు తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి అన్నదమ్ముల అనుబంధం, అక్బర్ సలీం అనార్కలి, అనురాగదేవత వంటి చిత్రాల్లో నటించాడు. అన్ని సినిమాలు మ్యూజికల్ హిట్ అయితే 'అక్బర్ సలీమ్ అనార్కలి' కమర్షియల్ గా ఏ మాత్రం లాభాలు చూడలేదు. బాలయ్య హీరోగా అయిన తర్వాత అ అనే అక్షరం తో మొదలైన 'అనసూయమ్మగారి అల్లుడు'లో నటించారు. ఈసినిమా రజతోత్సవం చేసుకుంది. బాలకృష్ణ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'అపూర్వ సహోదరులు'. ఇది కూడ పాక్షిక విజయం సాధించింది.

ఇక ఆ తర్వాత " అ " తో మొదలయ్యే బాలయ్య చిత్రాలు ఏవంటే--అల్లరి కృష్ణయ్య,అశ్వమేధం,అల్లరి పిడుగు, అశోకచక్ర,ఆది నాయకుడు. ఈ చిత్రాల ఫలితం ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు బాలయ్య తో తీయబోయే సినిమా " అ "తో మొదలయ్యే అఖండ టైటిల్ అయింది. ఈ సినిమా బాలకృష్ణ బోయపాటి కాంబినేషనన్ హ్యాట్రిక్ సొంతం చేసుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ టైటిల్ విషయంలో కొంచెం ఆందోళనకు గురి అవుతున్నారు. అయితే ఈ సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో  లేదో అనేది మనకు తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: