ఇక సినిమా సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో రక రకాల గాసిప్స్ పుట్టుకురావడం సర్వ సాధారణం. అయితే కొన్ని రకాల అబద్దపు వార్తలు అయితే వారిని పర్సనల్‌గా చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఇక చిన్నారి పెళ్లికూతురు ఫేమ్, సినీమా హీరోయిన్ అవికా గోర్ విషయంలో అదే జరిగింది. తన సహ నటుడు మనీష్ రైసింఘన్‌తో ఆమె డేటింగ్ చేస్తోందని, అంతేగా రహస్యంగా ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చిందనే వార్తలు గత కొన్ని రోజులుగా తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా వీటిపై రియాక్ట్ అయిన అవికా..ఆమె ప్రేమ వ్యవహారాన్ని బయటపెడుతూ అసలు విషయం చెప్పింది.ఇక వెండితెర, బుల్లితెరలపై బాగా రాణిస్తున్న అవికా.. ఒకానొక సమయంలో కొంచెం బొద్దుగా మారి అవకాశాలు కోల్పోయింది.ఇక ఆ తర్వాత కొన్ని రోజుల తరువాత క్రమంగా నాజూకు లుక్ లోకి వచ్చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే అవికా తల్లయిందనే వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక దీనిపై తాజాగా ఆమె ఫుల్ గా క్లారిటీ ఇచ్చేసింది.

ఇక మనీష్ తనకు మంచి స్నేహితుడని, అలాంటి వ్యక్తిని ముడిపెట్టి మా ఇద్దరిపై గాసిప్స్ రాయడం చాలా తీవ్రంగా బాధ పెట్టాయని ఆమె పేర్కొంది. ఇక అలా వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కన్ఫమ్ చేసిన అవికా.. హైదరాబాద్‌కు చెందిన మిలింద్‌ చంద్వాణీ అనే ఓ యువకుడితో రిలేషన్‌లో ఉండి డేటింగ్ చేస్తున్నట్లు చెప్పింది.ఎంతో తీవ్రమైన మనోవేదన నుంచి బయటపడి తను మామూలు మనిషిలా మారడానికి కారణం ఆమె ప్రియుడు మిలింద్ చంద్వాణినే అని అవికా చెప్పుకొచ్చింది... ఇక అతనితో రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నానని ఓపెన్ గా చెప్పింది.ఇక తనను తాను అర్థం చేసుకోవడానికి మిలింద్‌ ఎంతగానో సాయ పడ్డాడని, ఇక ఆయన పాజిటివ్ ధోరణితోనే తనలో శారీరక, మానసిక మార్పులు వచ్చి తిరిగి ఇలా నాజూకయ్యి సంతోషంగా ఉన్నానని అవికా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: