టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు తో ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు రాగా బాక్సాఫీస్ వద్ద ఫలితం తేడా వచ్చింది. అయితే బుల్లితెర లో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. బుల్లితెర హిట్ లు గా పిలవబడే ఈ సినిమాలు వెండితెర ప్రేక్షకులను మెప్పించలేదన్నది మాత్రం లేదన్నది వాస్తవం. దాంతో ఇప్పుడు వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా అయినా వెండితెర ప్రేక్షకులకు మెప్పించాలని ప్రిన్స్ అభిమానులు కోరుతున్నారు. 

ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ తో చేతులు కలపపోతున్నాడట.అయితే రాజమౌళితో సినిమా అని మరో వైపు ప్రచారం జరుగుతున్న అందులో వాస్తవం లేదు అని త్రివిక్రమ్ ప్రకటనతో తేలిపోయింది. అయితే మొత్తం రాజమౌళి సినిమా పక్కన పెట్టడం కాకుండా ఈ సినిమా తర్వాత రాజమౌళితో మహేష్ బాబు చేతులు కలుపుతాడు అని అంటున్నారు. 

ఇకపోతే త్రివిక్రమ్ గత కొన్ని సినిమాలుగా సంగీత దర్శకుడిగా తమన్ నే ఎంచుకుంటున్నాడు. అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురం లో సినిమాలు సంగీతం పరంగా సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాకి కూడా తమన్ నే సంగీత దర్శకుడిగా తీసుకుంటారు అని అనుకున్నారు. కానీ తన సినిమా గురించి అన్ని విషయాలు వెల్లడిస్తున్న కూడా సంగీత దర్శకుడు విషయంలో త్రివిక్రమ్ మహేష్ బాబు ఏ మాత్రం నోరు విప్పడం లేదు. దేవిశ్రీ ప్రసాద్ ను వదిలేసి నట్లే తమన్ ని కూడా త్రివిక్రమ్ వదిలేసి వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో వెళ్తున్నాడా అనేది ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: