
టాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కి మంచి పేరుంది. తొలి సినిమాతోనే ఆయనలో కసి ఎంత ఉందో తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పూరిజగన్నాథ్ ఆ తర్వాత వెను తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేసి టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. స్టార్ హీరో కూడా ఆయనతో సినిమా చేయాలని చూసే వారే. పూరి జగన్నాథ్ తో సినిమా చేస్తే స్టార్ హీరో అయినట్లే అని నమ్మేవారు యంగ్ హీరోలు. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న ప్రతి ఒక్కరూ పూరి జగన్నాథ్ తో సినిమా చేసి స్టార్ హీరోలు అయ్యారు.
మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎత్తుపల్లాలు చూసిన పూరి జగన్నాథ్ ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుండడం విశేషం. బాలీవుడ్ లో నేరుగా ఈ సినిమా విడుదల అవుతుంది. పూరి జగన్నాథ్ బాలీవుడ్ లో సినిమా చేయడం ఇది రెండవ సారి. మొదటిసారి అమితాబచ్చన్ తో బుడ్డా హోగా తేరా బాప్ అనే సినిమా చేశాడు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత బాలీవుడ్ లో సినిమా చేయట్లేదు.
ఇక పూరి జగన్నాథ్ బ్యాడ్ టైం లో ఎందరో హీరోలు తనకు హ్యాండ్ ఇచ్చారని కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని కొన్ని సార్లు చెప్పి బాధపడ్డాడు. ముఖ్యంగా గా పూరీ ని చిరు ఎంతగానో నమ్మించి మోసం చేశారట. మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి తన 150వ సినిమా చేస్తున్న సమయంలో పూరి జగన్నాథ్ ఆటో జానీ అనే కథను చెప్పాడు. ఆ సినిమా కథ చాలా బాగుందని కొన్ని మార్పులు చేస్తే తను తప్పకుండా ఈ సినిమా చేస్తానని పూరి జగన్నాథ్ కి మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. చివరికి కత్తి సినిమా వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150 చేశారు చిరంజీవి దాంతో ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ పెట్టిన ఏడాది సమయం వృధా అయినట్లు అయింది. అలా పూరి జగన్నాథ్ కు నిద్ర లేని రాత్రులు మిగిల్చాడు మెగాస్టార్ చిరంజీవి.