ప్రేమ మూగ‌ది.. విశ్వాసం గొప్ప‌ది..
మూగ జంతువుల ప్రేమ..అవి క‌న‌బ‌రిచే విశ్వాసం ద‌గ్గ‌ర
మ‌నుషులు ఓడిపోతారు..తాము కూడా ఇందుకు అతీతం కాదు అని అంటున్నారు ఆ ఇద్ద‌రూ.. వారే రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీరిద్దరికి పెట్స్  అంటే ఎంత ఇష్టమో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఈ విషయం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది అంటే, ఆగస్టు - 22 - 2021 వ తేదీ రాత్రి 8:30 నిమిషాలకు జెమినీ టీవీలో ప్రసారమైన ఎవరు నీలో కోటీశ్వరులు అనే షో కి గెస్ట్ గా రామ్ చరణ్ హాజరు కావడం జరిగింది. ఇక ఈ షోకు హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఇందులో భాగంగానే ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ఒకరి గురించి మరొకరికి ఎంత తెలుసు అనే విషయాలను చర్చించుకున్నారు.  ఇక అందులో భాగంగానే రామ్ చరణ్ ఒక పెట్ లవర్ అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. అలాగే ఎన్టీఆర్ సంభాషిస్తూ.." ఈయన దగ్గర ప్రస్తుతం ఆరు కుక్కలు ఉన్నాయి..అని తెలిపాడు.ఇక రామ్ చరణ్ కూడా మాట్లాడుతూ.."  మీ అందరికీ తెలియదు గానీ ఎన్టీఆర్ దగ్గర ఒకప్పుడు రెండు కుక్కలు ఉండేవి. అందులో ఒక కుక్క అయితే ఎంత పెద్దగా ఉండేది అంటే అలాంటి కుక్క హైదరాబాద్ మొత్తంలో  కూడా ఉండదేమో"  అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.


ఇక లోలోపల ఎన్టీఆర్ ఆ కుక్కని తలచుకుని ఎమోషనల్ కూడా అయ్యారు. " అయితే అనారోగ్యంతో ఆ కుక్క చనిపోయింది.. అప్పటి నుంచి తనకు  కుక్కల మీద మళ్లీ ఆశలు లేవని ఎన్టీఆర్ అనగానే అలాంటిదేమీ లేదు ..మీ చేత మళ్ళీ ఒక కుక్కను  పెంచేలా చేస్తాను..అని  రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. అలాగే నేను నీకు మంచి కుక్కపిల్లను  గిఫ్ట్ గా ఇస్తాను అని కూడా అన్నాడు.


ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ గ్యాప్ లో  కూడా మనం ఈ కుక్కల గురించి, బర్డ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా..!  అని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నాడు. మొత్తం మీద ఇద్దరు పెట్ లవర్స్ అని చెప్పుకునే ప్రయత్నం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: