టాలీవుడ్ సినిమా పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి ఇప్పటివరకు హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు అక్కినేని అఖిల్. అక్కినేని నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చి మంచి మంచి దర్శకులతో సినిమాలు చేసినా కూడా విజయాలు అందుకోలేక పోతున్నాడు. తనకు ఎంత బ్యాడ్ లక్ ఉందో అందరికీ చాటి చెప్పుతూ కష్టపడుతూ స్టార్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నాలుగో సినిమా చేస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు అక్కినేని కుర్రాడు.

తొలి సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఒక్కసారిగా అఖిల్ గురించి నెగిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోయాయి. ప్రేక్షకులలో రెండో సినిమా పర్వాలేదనిపించినా మూడో సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఇప్పుడు హిట్ కొట్టాల్సిన పరిస్థితి తప్పక ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ వాంటెడ్ బ్యాచ్ లర్ అనే సినిమాలో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా ఇప్పటివరకు ఈ సినిమా విడుదల కాకపోవడంతో ఆయన అభిమానులలో ఒక్కసారిగా నిరాశ అలుముకుంది.

సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అక్కినేని అఖిల్ ఎప్పుడు హిట్ కొడతాడా అనే ఆలోచిస్తున్నా వారికి ఇప్పుడు శుభవార్త. దసరా కానుకగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓ టీ టీ లో విడుదల అవుతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేస్తున్నారని మరొక వార్త వారిని ఎంతగానో సంతోషపడుతుంది. మరి అక్కినేని అఖిల్ నాలుగో సినిమా తో నైనా మొదటి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. మరోవైపు టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో ఏజెంట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా భారీ బడ్జెట్ తో ఈ సినిమా  చేస్తున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: