రామ్ చరణ్
ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న
ఆర్ఆర్ఆర్ సినిమా త్వరలోనే విడుదల అవుతుందని నిన్నటి దాకా ప్రచారం జరిగింది. కానీ ఈ చిత్రం విడుదల ఎప్పుడు అవుతుందో చెప్పలేము అని ఇటీవల చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉందట చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో ఇది పూర్తయిన తర్వాత వీఎఫ్ఎక్స్ పనులు భారీగా ఉండడంతో దానికి చాలా సమయం తీసుకుంటుందడం తో ఈ
సినిమా విడుదల ఎప్పుడు అవుతుందో అన్న విషయంపై ఓ అంచనాకు రాలేకపోతున్నారట జక్కన్న.
దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందుగా ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించగా నేపథ్యంలో సూటింగ్ ఆలస్యం కావడంతో
అక్టోబర్ 8న విడుదల చేస్తామని ప్రకటించింది చిత్రబృందం అయితే రెండవ దశ కరుణ పడడంతో ఈ తేదీన కూడా ఈ
సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. పోనీ
జనవరి ఎనిమిదో తారీఖున ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికార ప్రకటన చేస్తారని అనుకో గా ఇప్పుడు అది కూడా కష్టమే అని చిత్రబృందం తేల్చేసింది.
ఈ నేపథ్యంలో ఈ
సినిమా విడుదల వాయిదా అవడం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న
ఎన్టీఆర్ రామ్ చరణ్ తదుపరి సినిమాలపై భారీ ప్రభావం చూపిస్తుందని తెలుస్తుంది.
రామ్ చరణ్ తన తదుపరి సినిమాను
శంకర్ దర్శకత్వంలో చేస్తూ ఉండగా ఈ
సినిమా విడుదలను వేసవిలో ప్లాన్ చేయగా ఇప్పుడు
ఆర్ఆర్ఆర్ సినిమా వేసవిలో విడుదల అయితే ఆ చిత్రం పోస్ట్ పోన్ తప్పక అవుతుంది. అలాగే
ఎన్టీఆర్ కూడా
కొరటాల శివ చిత్రాన్ని త్వరలో మొదలుపెట్టి వచ్చే ఏడాది దసరాకు విడుదల చేయాలని భావించగా ఈ
సినిమా విడుదల వాయిదా పడడం తో ఇప్పుడు ఈ సినిమాల పరిస్థితి ఏంటో చూడాలి.